Home Entertainment ఓవర్సీస్ లో జల్సా స్పెషల్ షోస్ రికార్డుని బద్దలు కొట్టిన చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోస్

ఓవర్సీస్ లో జల్సా స్పెషల్ షోస్ రికార్డుని బద్దలు కొట్టిన చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోస్

0 second read
0
0
62

ఇటీవలే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు అభిమానులు జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షోస్ కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి కనివిని ఎరుగని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది..సుమారు 375 స్పెషల్ షోస్ కి గాను 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం..ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇప్పట్లో ఈ సినిమా రికార్డు ని ఎవ్వరు ముట్టుకోలేరని ట్రేడ్ పండితులు సైతం అనుకున్నారు..కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షోస్ జల్సా ఓవర్సీస్ రికార్డు ని బద్దలు కొట్టే దిశగా పరుగులు తీస్తుంది..సుమారు 43 స్పెషల్ షోస్ ని బాలయ్య బాబు ఫాన్స్ ఈ సినిమా కోసం ప్లాన్ చేసారు..సెప్టెంబర్ 25 వ తారీఖున ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభిమానులు ఈ సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా ప్లాన్ చేసారు.

జల్సా సినిమా ఓవర్సీస్ ప్రాంతం లో దాదాపుగా 50 వేల డాలర్లు వసూలు చేసింది..ఒక్క అమెరికా నుండే ఈ సినిమాకి దాదాపుగా 37 వేల డాలర్లు వచ్చాయి..ఇది ఆల్ టైం సెన్సషనల్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇప్పుడు ఈ రికార్డు ని చెన్నకేశవ రెడ్డి బద్దలు కొట్టబోతుంది అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో గట్టిగ వినిపిస్తుంది..బాలయ్య బాబు కి మొదటి నుండి ఓవర్సీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..గత ఏడాది విడువులైన అఖండ సినిమా కి అభిమానులు ఇక్కడ భూమి బద్దలయ్యే రేంజ్ లో హుంగామ చేసారు..చెన్నకేశవ రెడ్డి సినిమా స్పెషల్ షోస్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఓవర్సీస్ లో ఉన్నంత డిమాండ్ అయితే లేదు కానీ..ఇప్పుడు ఆ చిత్రం జల్సా రికార్డు ని ఓవర్సీస్ లో కొట్టడం అందరికి ఆశ్చర్యాన్ని కలగచేస్తున్న విషయం..ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో ప్రారంభించారు..సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ అని అనలేము కానీ పర్వాలేదని చెప్పొచ్చు.

చెన్నకేశవ రెడ్డి 2002 వ సంవత్సరం లో సెప్టెంబర్ 25 వ తారీఖున విడుదలైంది..VV వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి..ఎందుకంటే వ్ వినాయక్ గత చిత్రం ఆది ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది..ఆ సినిమా వెంటనే బాలయ్య బాబు లాంటి మాస్ హీరో తో చెన్నకేశవ రెడ్డి సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు తారాస్థాయిలో ఉండేవి..అంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..యావరేజి గా ఆడింది..అప్పట్లో ఈ సినిమా సుమారు 16 నుండి 17 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..భారీ అంచనాలే ఈ సినిమా కొంప ముంచిందని..ఫస్ట్ హాఫ్ లో చిన్న బాలయ్య బాబు పాత్ర ని మరింత పవర్ ఫుల్ గా చూపించి ఉంటె ఆది రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని నందమూరి అభిమానులు అంటూ ఉంటారు..అయితే కాలక్రమేణా ఈ సినిమా నేటి తరం వారికి బాగా నచ్చింది..ఈ సినిమా ని స్పెషల్ షోస్ వేస్తె చూడాలనే కోరిక చాలా మందిలో ఉంది..అందుకే ఈ సినిమా కి నేడు స్పెషల్ షోస్ పడుతున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…