Home Entertainment ‘ఓరి దేవుడా’ మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని రేంజ్ ఇది

‘ఓరి దేవుడా’ మొదటి రోజు వసూళ్లు..ఎవ్వరు ఊహించని రేంజ్ ఇది

0 second read
0
0
538

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ఓరిదేవుడా. దీపావళి కానుకగా శుక్రవారం ఈ మూవీ విడుదలైంది. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా ఓ మై కడవులే అనే తమిళ సినిమా ఆధారంగా తెరకెక్కింది. ఒరిజినల్ వెర్షన్‌ను రూపొందించిన అశ్వత్ మారిముత్తు ఓరి దేవుడాను కూడా తెరకెక్కించాడు. దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి లాంటి అగ్ర నిర్మాతలు కలిసి ఈ మూవీని నిర్మించారు. ప్రముఖ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో దేవుడి పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు భర్తగా ఫ్రస్టేషన్ చూపించే సన్నివేశాల్లో విశ్వక్ సేన్ అదరగొట్టినట్లు రివ్యూలు వచ్చాయి. అటు వెంకటేష్, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సన్నివేశాలు ఫన్నీగా ఉండటంతో ఓరి దేవుడా మూవీ ప్రేక్షకులను టైంపాస్ చేస్తుందని అందరూ చెప్తున్నారు. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్లతో మంచి ఆసక్తి రేపడంతో రిలీజ్ రోజు సంతృప్తికర స్థాయిలోనే ఓరి దేవుడా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఓరి దేవుడా మూవీ తొలిరోజు ఏపీ, తెలంగాణలో రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి నైజాంలో 155, సీడెడ్‌లో 60, ఆంధ్రాలో 200 స్క్రీన్‌లు దక్కాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 415 స్క్రీన్‌లలో విడుదలైంది. అటు ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం బిజినెస్ వాల్యూ రూ.4.50 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే మరో కోటి దాకా వాల్యూ బిజినెస్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలంటే మినిమమ్ 6 కోట్ల రేంజ్‌లో షేర్‌ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాలి. తొలిరోజు రూ.4 కోట్ల వరకు రాబట్టడంతో వీకెండ్‌లోగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చేరుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఓరిదేవుడా మూవీలో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్‌లుగా నటించారు. 2020లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిందని.. అయితే కోవిడ్ లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా ఆలస్యమైందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ వెల్లడించాడు. 2021లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉందని… వాస్తవానికి అశోకవనంలో అర్జుణ కల్యాణం సినిమా కంటే ముందే ఓరి దేవుడా సినిమా చేయాలని భావించామని తెలిపాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో తాను కొంత పెద్ద వయస్కుడిగా కనిపిస్తే ఓరి దేవుడా చిత్రంలో యువకుడి పాత్రలో కనిపిస్తానని.. సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి నటించడం తన అదృష్టమని తెలిపాడు. సీతారామం, బింబిసార సినిమాలు ఒకేసారి విడుదలైనా విజయం సాధించాయని.. అలాగే జిన్నా, ప్రిన్స్, సర్ధార్ మూవీస్‌తో పాటు తన సినిమా విడుదలైనా అన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…