Home Entertainment ఒక్క హైదరాబాద్ లోనే 200 షోలు..చరిత్ర తిరగరాస్తున్న జల్సా స్పెషల్ షోస్

ఒక్క హైదరాబాద్ లోనే 200 షోలు..చరిత్ర తిరగరాస్తున్న జల్సా స్పెషల్ షోస్

0 second read
0
0
109

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన జల్సా సినిమా మేనియా నే కనిపిస్తుంది..2008 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 2 మూవీ గా నిలిచింది..ఖుషి నుండి సరైన సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది..ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అప్పట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇప్పటికి కూడా ఈ సినిమాలోని పాటలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి..దేవిశ్రీప్రసాద్ ఆ రేంజ్ సంగీతం ని ఈ సినిమాకి అందించాడు..అలాంటి సినిమాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా వెయ్యికి పైగా షోస్ ని ప్లాన్ చేస్తున్నారు ఆయన అభిమానులు..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా టికెట్స్ అన్నీ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.

ఒక్క హైదరాబాద్ లోనే ఈ సినిమాకి 200 కి షోస్ వెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..పబ్లిక్ లో డిమాండ్ విపరీతంగా ఉండడం తో ఈ షోస్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది..పవన్ కళ్యాణ్ కి నైజాం ప్రాంతం లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది మన అందరికి తెలిసిందే..ఖుషి నుండి ఆయనకీ యూత్ లో వేరే లెవెల్ క్రేజ్ ఏర్పడింది..అప్పటి నుండి ఇప్పటి వరుకు ఆయన సినిమాలు ఇక్కడ విద్వాంసం సృష్టించాయి..ఇక ఈ ఏడాది విడుదలైన భీమ్లా నాయక్ సినిమా కూడా యావరేజి టాక్ మీదనే నైజాం ప్రాంతం లో 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది..ఇక సెప్టెంబర్ 1 వ తేదీన ప్లాన్ చేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి అయితే హైదరాబాద్ సిటీ లో స్టార్ హీరో కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి డిమాండ్ అయితే ఉంటుందో అలాంటి డిమాండ్ ఏర్పడింది..ఒక్క ప్రసాద్ మల్టిప్లెక్స్ లోనే ఈ సినిమాకి 20 కి షోస్ వేస్తున్నారు అంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఈ సినిమా స్పెషల్ షోస్ కి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు..అదే కనుక జరిగితే ఈ రికార్డు ని భవిష్యత్తులో ఎవ్వరు కూడా ముట్టుకోలేరు అనే చెప్పాలి..ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ పోకిరి సినిమా స్పెషల్ షోస్ కౌంట్ ని జల్సా సినిమా కేవలం నైజం ప్రాంతం నుండే కొట్టే రేంజ్ ట్రెండ్ ప్రస్తుతం కనిపిస్తుంది..వాస్తవానికి ఈ సినిమాని సెప్టెంబర్ 2 వ తేదీనే వెయ్యాలని అనుకున్నారు..కానీ ఆరోజు వరుసగా రెండు సినిమాలు విడుదల అవ్వబోతుండడం తో ముందు రోజు కి ప్రీ పోన్ చేసారు..అంటే కాకుండా జల్సా సినిమా కి పోటీ గా తమ్ముడు సినిమా షోస్ కూడా పెంచుకుంటూ పోతున్నారు అభిమానులు..ఈ షోస్ కూడా రికార్డు స్థాయి లో ఫుల్స్ పడిపోతున్నాయి..అలా ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మేనియా తో తెలుగు రాష్ట్రాలు ఊహిపోతున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…