
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదు అని చెప్పడం ఎలాంటి అతి సయోక్తి లేదు..కేవలం వెండితెర మీద కనిపిస్తే చాలు అని సంతృప్తి పడే వీరాభిమానులు పవన్ కళ్యాణ్ సొంతం..అందుకే ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని తెచుకుంటాయి..ఇక ప్రస్తుతం OTT రాజ్యమేలుతున్న సమయం లో థియేట్రికల్ రన్ క్రమక్రమంగా తగ్గిపోతుంది..రీమేక్ సినిమాలకు అయితే కాలం చెల్లిపోయింది..ఎంతపెద్ద స్టార్ హీరో కి అయినా రీమేక్ సినిమాలకు ఓపెనింగ్స్ రావడం లేదు..కానీ పవన్ కళ్యాణ్ నటించిన గత రెండు చిత్రాలు రీమేక్ సినిమాలే..ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ రెండు సినిమాలు విడుదలయ్యాయి..కానీ మొదటి రోజు రికార్డ్స్ నుండి ప్రీమియర్ రికార్డ్స్ వరుకు ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేశాయి..అలా ఇప్పటి వరుకు రీన్ట్ టైం లో ఏ హీరో కి జరగలేదు.
రీమేక్ సినిమాలకే అంతతి వసూళ్లు వస్తే ఇక పవన్ కళ్యాణ్ తన తోటి స్టార్ హీరోలు లాగ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా మన తరం కాదు..సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అలాంటి అద్భుతమైన కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నాడు..ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ అనే పీరియాడిక్ జానర్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్..ఆ సినిమా తర్వాత ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజీత్ తో మరో మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమాని #RRR మూవీ నిర్మాత DVV దానయ్య నిర్మించబోతున్నాడు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు ఉదయం చేసారు..కాన్సెప్ట్ పోస్టర్ తోనే అభిమానులకు పిచ్చెక్కిపోయ్యేలా చేసాడు సుజీత్..ఆయన పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అనే విషయం అందరికి తెలుసు..ఒక వీరాభిమాని ఆకలితో సినిమా తీస్తే గబ్బర్ సింగ్ లాంటి చరిత్ర వచ్చింది..మళ్ళీ అలాంటి వీరాభిమాని భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టమే.
ఇక ఇన్ని రోజులు రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకున్న స్టార్ హీరోల అభిమానులు చాలా గర్వం గా సోషల్ మీడియా లో మా హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతారు అని చెప్పుకునేవాళ్ళు..కానీ పవన్ కళ్యాణ్ సాహూ వంటి ఫ్లాప్ సినిమా తీసిన డైరెక్టర్ తో ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నాడు అని ప్రకటన రాగానే ఇతర హీరోల అభిమానులకు కుళ్ళు మొదలైంది..ఎందుకంటే ఈ ప్రకటన సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టించేసింది..అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుండి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..సినిమా అనుకున్న విధంగా విడుదలైతే మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టించడం ఖాయం..వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుండే అంచనాలు వెయ్యడం ప్రారంభించేసాయి.