
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీర మల్లు గత కొంత కాలం నుండి షూటింగ్ కార్యక్రమాలు ఆపుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు నిలిచిపోవడానికి రకరకాల కారణాలు సోషల్ మీడియా లో ప్రహ్చారం అవుతూ ఉండేవి..నిర్మాతకి బడ్జెట్ సమస్యలు రావడం వల్ల సినిమాని ఆపేసారు అంటూ కొంతమంది..మరియు పవన్ కళ్యాణ్ కి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ నచ్చక సినిమాని మధ్యలో ఆపేసారు అని మరికొంత మంది..ఇలా సోషల్ మీడియా లో ఎవరికీ తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు..కానీ ఆ నిర్మాత AM రత్నం గారు అలాంటిది ఏమి లేదని..భారీ సెట్లు వేస్తున్నామని..దానికి సమయం బాగా పడుతుంది కాబట్టే షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని..ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది లోపు సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి 30 వ తారీఖున ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో ఘనంగా విడుదల చేస్తాము అంటూ చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని కూడా విడుదల చేసింది మూవీ టీం..ఈ వీడియో కి యూట్యూబ్ లో సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది..కోర మీసాన్ని మెలేస్తూ పెద్ద పెద్ద ఉస్తాదులను విసిరి వేస్తూ పవన్ కళ్యాణ్ తొడ కొడుతూ నిలబడిన ఈ గ్లిమ్స్ వీడియో కి కేవలం అభిమానుల నుండే కాదు..ప్రేక్షకుల నుండి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది..దీనితో ట్రేడ్ వర్గాల్లో కూడా హరి హర వీరమల్లు సినిమా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది..గ్లిమ్స్ వీడియో విశేషంగా ఆకట్టుకోవడం తో ఈ సినిమా కి ఒక్క తెలుగు లో మాత్రమే కాదు..ఇతర ప్రాంతీయ బాషలలో కూడా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి..ప్రస్తుతానికి మొత్తం మీద అన్ని భాషలకు కలిపి ఈ సినిమాకి 300 కోట్ల రూపాయిలు థియేట్రికల్ ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తుంది..అయితే నిర్మాత AM రత్నం గారు మాత్రం ఇప్పటి వరుకు ఎవరికీ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు.
సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని..మిగిలిన ప్రమోషనల్ కంటెంట్ వదిలితే కచ్చితంగా మరింత క్రేజీ ఆఫర్లు వస్తాయి అనే బలమైన నమ్మకం తో ఉన్నాడట..ఈ చిత్రాన్ని ఆయన సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవెల్ లో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా ఇదే..దీనితో అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు..ఈ సినిమా కనుక భారీ హిట్ అయితే పవన్ కళ్యాణ్ రాజమౌళి సహాయం ఏ మాత్రం అవసరం లేకుండా పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ ని సాధించిన రెండవ హీరో గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు అని అంటున్నారు అభిమానులు..ఇది వరుకు రాజమౌళి సహాయం లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగోడి సత్తా చాటిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమా తో గత ఏడాది ఆయన సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది..ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అల్లు అర్జున్ రేంజ్ లోనే పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటుతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..మరి వారి నమ్మకాలను ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో చూడాలి.