
నందమూరి కుటుంబానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.తెలుగు వాడి ఖ్యాతిని నాలుగు దేశాబ్దాల క్రితమే దేశం మొత్తం మారుమోగిపోయ్యేలా చేసిన ఘనత ఉన్న కుటుంబం అది.అలాంటి కుటుంబం నుండి వచ్చిన వారసులు రాజకీయంగా సక్సెస్ అయ్యారు, సినిమాల పరంగా కూడా సక్సెస్ అయ్యారు.కానీ సినిమాల పరంగా ఈ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ సక్సెస్ మాత్రం కాలేకపోయారు.వారిలో నందమూరి తారకరత్న ఒకడు.ఎన్టీఆర్ మనవడిగా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు తారకరత్న.ఆ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.ఆ తర్వాత తారకరత్న ఏకంగా ఒకే రోజు 9 సినిమాలకు సంతకం పెట్టాడు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఇది ఒక అరుదైన అన్ బీటబుల్ రికార్డు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
కానీ వీటిల్లో కొన్ని మాత్రమే చిత్రీకరణ జరుపుకొని విడుదలయ్యాయి.మరికొన్ని సినిమాలు తారకరత్న కి వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల ఫైనాన్స్ కరువై అసలు షూటింగ్స్ ప్రారంభించుకోలేకపోయ్యాయి.ఆ తర్వాత ఆయన హీరో గా ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ, ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.దీనితో ఆయనకీ హీరో గా అవకాశాలు తగ్గిపోవడంతో విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు.అమరావతి సినిమాలో ఆయన పోషించిన నెగటివ్ క్యారక్టర్ కి ఏకంగా నంది అవార్డు వచ్చింది.ఆ తర్వాత పలు సినిమాల్లో విలన్ గా నటించిన తారకరత్న, రీసెంట్ గానే డిస్నీ + హాట్ స్టార్స్ లో ‘9 హావర్స్’ అనే వెబ్ సిరీస్ లో హీరో గా నటించాడు.ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మాతగా మరియు రైటర్ గా వ్యవహరించిన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.తారకరత్న కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈయన గుండెపోటు తో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.బ్రతికి ఉన్నన్ని రోజులు ఆయనని ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ, చనిపోయిన తర్వాత మాత్రం ఆయన గురించి ఎన్నో విషయాలతో కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉన్నాయి.రీసెంట్ గా ఆయన ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం అందుకునేవాడో తెలిసిందే.’ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాలో హీరో గా చేసినందుకు గాను ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ పది లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చాడట.ఆ తర్వాత కూడా హీరో గా చేస్తున్నంత కాలం 50 లక్షల వరకు రెమ్యూనరేషన్స్ అందుకున్నాడట.కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం తో నిర్మాతలు ఆయనకీ డబ్బులు కూడా ఇచ్చేవారు కాదట.ఇక రీసెంట్ గా చేసిన 9 హావర్స్ వెబ్ సిరీస్ కి మాత్రం రెండు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడట.అలా కెరీర్ అటు రాజకీయపరంగా ఇటు సినిమాల పరంగా గాడిలో పడుతున్న సమయం లో ఆయనకీ ఇలా జరగడం అనేది నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి.