Home Entertainment ‘ఒక్కడు’ రీ రిలీజ్ మొదటిరోజు వసూళ్లు..డిజాస్టర్ దిశగా దూసుకెళ్తుంది

‘ఒక్కడు’ రీ రిలీజ్ మొదటిరోజు వసూళ్లు..డిజాస్టర్ దిశగా దూసుకెళ్తుంది

0 second read
0
0
462

మహేష్‌బాబును స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్‌ను చేసిన సినిమాల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫ్యాక్షన్ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి్ంది. మహేష్ బాబు 7వ సినిమాగా రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ మూవీ తాజాగా శనివారం నాడు రీ రిలీజ్ అయ్యింది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎంఎస్ రాజు ఈ మూవీని నిర్మించగా.. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన భూమిక నటించగా.. విలన్‌గా ప్రకాష్ రాజ్ చేశాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఒక్కడు మూవీ మోడరన్ క్లాసిక్‌లా టాలీవుడ్‌లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఉన్న చాలా మంది యంగ్ మహేష్ అభిమానులు ఒక్కడు సినిమాని థియేటర్లలో చూసి ఉండరు. ఆ మాస్ హిస్టీరియాను అభిమానులు ఇప్పుడు థియేటర్లలో చూసే ఛాన్స్ వచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా చాలా సెంటర్లలో ఒక్కడు సినిమా రీ రిలీజ్ అయ్యింది.

అయితే ఇటీవల రిలీజైన ఖుషీ మూవీతో పోలిస్తే ఒక్కడు సినిమాకు తొలిరోజు వసూళ్లు తక్కువగానే వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలిరోజు ఈ మూవీ రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ ఖుషీ సినిమా రీ రిలీజ్‌లో తొలిరోజు రూ.3 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఖుషీ సినిమాను ఒక్కడు అధిగమించలేకపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఒక్కడు సినిమా సుమారు 250 థియేటర్లలో విడుదలైనట్లు తెలుస్తోంది. అటు మహేష్ ఫాన్స్ ఒక్కడు సినిమా రిలీజ్ అయిన సెంటర్లలో చేస్తున్న హంగామాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి థియేటర్ దగ్గర ఫాన్స్ సంబరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఉండే వాళ్లకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల పుణ్యమా అని ఫాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో అందరికీ తెలిసిపోతోంది. ఒక్కడు సినిమాకు అభిమానులు చేస్తున్న హంగామా చూస్తుంటే ఒక రెండు దశాబ్దాల క్రితం రిలీజ్ అయిన సినిమాకు, అది కూడా రీరిలీజ్ సినిమాకు ఈ రేంజులో సెలబ్రేషన్స్ చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే నైజాం ప్రాంతంలో ఖుషీతో సమానంగా ఒక్కడు సినిమా వసూళ్లు వచ్చినట్లు సమాచారం అందుతోంది. మిగతా ప్రాంతాల్లో ఖుషీ సినిమాను ఒక్కడు టచ్ చేయలేకపోయిందని తెలుస్తోంది. సంక్రాంతికి థియేటర్లు బిజీ అయిపోనున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా చేసిన వీరసింహా రెడ్డి, తమిళ్ హీరోలు విజయ్ ‘వారుసుడు’, అజిత్ ‘తెగింపు’, యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాలు వరుసగా జనవరి 11 నుంచి రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఒక్కడు మూవీని మరో రెండు రోజులు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంది. 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను 14 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ శేఖర్ జోసెఫ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ మణిశర్మ లాంటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేశారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…