Home Entertainment ‘ఒకే ఒక జీవితం’ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

‘ఒకే ఒక జీవితం’ మొదటి వారం వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
180

టాలీవుడ్‌లో విలక్షణమైన నటనతో ఆకట్టుకునే హీరోలలో శర్వానంద్ ఒకడు. సినిమా సినిమాకు అతడు ఎంతో వేరియేషన్ చూపిస్తుంటాడు. శతమానం భవతి, మహానుభావుడు, శ్రీకారం, జాను సినిమాలతో ఆకట్టుకున్న శర్వానంద్ లేటెస్టుగా ఒకే ఒక జీవితం మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఎలాంటి బజ్ లేకుండా విడుదలైన ఈ మూవీ మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను సొంతం చేసుకుంటోంది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీకార్తీక్ అనే యంగ్ దర్శకుడు తెరకెక్కించాడు. నాగార్జున సతీమణి అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. అమ్మ సెంటిమెంట్‌తో ఎంతో ఎమోషనల్‌గా ఈ చిత్రం అందరినీ కదిలిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు ఒకే ఒక జీవితం మూవీని నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 9వ తేదీన విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.జాక్స్ బిజాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బ్రహ్మాస్త్ర వంటి హైప్ సినిమాతో ఈ మూవీ విడుదల కావడంతో తొలిరోజు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మౌత్ టాక్, రివ్యూలు పాజిటివ్‌గా రావడంతో అందరూ ఈ సినిమా థియేటర్ల వైపు వెళ్లారు.

ఒకే ఒక జీవితం మూవీ తొలివారంలో రూ.8 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి రూ.6.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ.కోటి వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 7.50 కోట్ల బిజినెస్ జరగ్గా తొలివారంలోనే ఈ మొత్తాన్ని రాబట్టి టాలీవుడ్‌లో మరో క్లీన్ హిట్‌గా నిలిచింది. నైజాంలో రూ.3 కోట్లు, సీడెడ్‌లో రూ.40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.60 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.40 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.28 లక్షలు, గుంటూరులో రూ.35 లక్షలు, కృష్ణాలో రూ.35 లక్షలు, నెల్లూరులో రూ.20 లక్షల షేర్ వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ వారం కూడా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానుంది. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలకు మౌత్ టాక్ వస్తే తప్ప శర్వానంద్ మూవీపై ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు.

ఒకే ఒక జీవితం మూవీకి ముందు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. రష్మిక హీరోయిన్‌గా నటించడం రాధిక, ఖుష్బూ వంటి నటీమణులు ఉండటంతో ఆ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. కానీ ఆ సినిమా బోల్తా పడటంతో శర్వాకు హిట్ అనివార్యమైంది. శర్వా కెరీర్‌లో ఒకే ఒక జీవితం 30వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందించాడు. కానీ ఈ మూవీకి తొలుత అనుకున్న హీరో శర్వానంద్ కాదని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఈ సినిమాను ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. చాలా సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన నోటా సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన నోటా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ సాధించలేదు. ఈ సినిమా ఫలితం వల్ల తమిళ దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ఒకే ఒక జీవితం సినిమాలో నటించడానికి విజయ్ దేవరకొండ ఆసక్తి చూపించలేదు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ కచ్చితంగా మరింత పెరిగి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…