
ఇండస్ట్రీ లో అతి తక్కువ స్పాన్ ఉన్న కెరీర్ ఎవరిదైనా ఉందా అంటే అది హీరోయిన్ కెరీర్ మాత్రమే..నేడు అందాలు ఆరబోస్తూ టాలీవుడ్ లో మంచి మంనుంచి ఆఫర్లు దక్కించుకుంటూ డబ్బులు బాగా వేసుకోవచ్చు..కానీ ముఖం మీద ముడతలు రావడం ప్రారంభమైతే ఇక హీరోయిన్స్ వైపు కనెత్తి కూడా చూడరు దర్శక నిర్మాతలు..అందుకే అందాన్ని మించి టాలెంట్ ఉండాలి..అలాంటి టాలెంట్ కి ప్రతి రూపం లాగ ఉంటుంది మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి..తన అద్భుతమైన నటన మరియు డాన్స్ తో కోట్లాది మంది అభిమానులను దక్కించుకుంది..మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే అందం విషయం లో కాస్త తక్కువే అయ్యినప్పటికీ కూడా తన టాలెంట్ తో శిఖరాగ్ర స్థాయి ఇమేజి ని చూస్తున్న ఏకైక సౌత్ హీరోయిన్ ఈమె ఒక్కటే..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ప్రేమమ్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సాయి పల్లవి మన టాలీవుడ్ లో ఫిదా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది..ఫిదా ఇక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం సాయి పల్లవి యాక్టింగ్ మరియు డాన్స్ కోసం ఈ సినిమాని ఎక్కువసార్లు చూసిన ఆడియన్స్ చాలా ఎక్కువ.
అలా అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యకుండా..తన మనసుకి నచ్చిన పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగింది సాయి పల్లవి..పాత్ర నచ్చకపోతే ఎంత డబ్బులు ఇస్తామని చెప్పిన కూడా ఒప్పుకోదు..మెగాస్టార్ చిరంజీవి వంటి వారి సినిమాలోనే నటించను రిజెక్ట్ చేసింది అంటే సాయి పల్లవి తానూ నమ్ముకున్న సిద్ధాంతాల పట్ల ఎంత బలంగా నిలబడిందో అర్థం చేసుకోవచ్చు..చిరంజీవి గారి సినిమాలో ఆఫర్ అంటే ఎవడు వద్దంటారు..కానీ నాకు రీమేక్ సినిమాలంటే భయం..అందుకే చిరంజీవి గారి సినిమాకి నో చెప్పాను..రీమేక్ కాకుండా డైరెక్టు స్టోరీ తో తీసే సినిమా అయితే తప్పకుండ నటిస్తాను..ఆయనతో నటించడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి..ఇలా ఆమె ఇండస్ట్రీ మనసుకి నచ్చక ఎన్నో సినిమాలు వదులుకుంది అట..అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా ఒకటి ఉంది.
సాయి పల్లవి కమిట్మెంట్ కి ఒక ఉదాహరణ ఇదే అని చెప్పొచ్చు..ఎందుకంటే సాయి పల్లవి పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్..ఆయనతో కలిసి నటించాలి అనేది ఆమె కోరికగా ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది..కానీ భీమ్లా నాయక్ సినిమా ఒక రీమేక్ అవ్వడం తో రీమేక్ లో నేను నటించలేనని చెప్పేసింది..ఇక ఆమె నో చెప్పడం ఆమె బదులు నిత్యామీనన్ ని తీసుకున్నారు..కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు..నటనకి ఏ మాత్రం ప్రాధాన్యం లేని స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి సాయి పల్లవి రిజెక్ట్ చేసింది..కేవలం గ్లామర్ షో ఉన్న పాత్రలు నేను చెయ్యలేను ..నాకు ఇష్టం లేదంటూ ఆ క్యారెక్టర్స్ ని రిజెక్ట్ చేసింది..స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తే సాయి పల్లవి కి 5 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడరు దర్శక నిర్మాతలు..కానీ సాయి పల్లవి వరుసగా డిజాస్టర్స్ తగిలిన కూడా అలాంటి పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదంటే నిజంగా గ్రేట్..ఇలా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన స్టార్ హీరోల సినిమాలన్నీ లెక్కగడితే ఆమె 50 కోట్ల రూపాయలకు పైగానే పారితోషికం ని మిస్ అయినట్టు తెలుస్తుంది.