
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన మెగాస్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు..ఈరోజు ఆయన అడుగుజాడల్లో ఆయన కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ కి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఏ రేంజ్ గుర్తింపుని తెచుకున్నారో మన అందరికి తెలిసిందే..ఒక్క ఫ్లాప్ మెగాస్టార్ కెరీర్ ని ఏ మాత్రం దెబ్బ తియ్యలేవు అని ఆయన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్ ప్రూవ్ చేస్తూనే వచ్చింది..ఇప్పుడు కూడా ఆయన రేంజ్ ఇసుమంత కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఉదాహరణ గా నిలిచింది గాడ్ ఫాదర్ చిత్రం..ఈ ఏడాది మెగాస్టార్ హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమా తో చిరంజీవి పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు..అభిమానులు సైతం కూడా చిరంజీవి 70 ఏళ్ళ వయసుకి దగ్గర్లో ఉన్నాడు..ఆయన స్టామినా తగ్గిందేమో అని సందేహించారు.
ఇక గాడ్ ఫాదర్ సినిమాకి అయితే హైప్ జెనెరేట్ అవ్వలేదు..కనీసం ఆచార్య రేంజ్ ఓపెనింగ్స్ కూడా రావేమో అని భయపడ్డారు అభిమానులు..కానీ చిరంజీవి లేటెస్ట్ గా ట్విట్టర్ లో పెట్టిన ఒకే ఒక ట్వీట్ తో నేషనల్ మీడియా మొత్తం గాడ్ ఫాదర్ సినిమా పై ద్రుష్టి సారించేలా చేసింది..’రాజకీయాలకు నేను దూరం గా ఉన్నాను..కానీ రాజకీయాలు నాకు దూరం గా లేవు’ అంటూ చిరంజీవి ట్విట్టర్ లో వదిలిన ఒక వాయిస్ నోట్ ఇప్పుడు సెన్సషనల్ గా మారింది..ఎక్కడ చూసిన దీని గురించే చర్చ..చిరంజీవి గారు రాజకీయాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోకి అడుగుపెట్టబోతున్నాని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడా..లేదా తన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాలోని డైలాగ్ చెప్పి మూవీ కి ఎక్కడ లేని హైప్ ని తీసుకొచ్చాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..టీవీ చానెల్స్ లో అయితే ఇప్పుడు దీని మీద లైవ్ డిబేట్స్ కూడా నడుస్తున్నాయి..చిరంజీవి ఏ ఉద్దేశ్యం తో ఈ పది సెకండ్స్ వాయిస్ నోట్ పెట్టాడో ఎవరికీ క్లారిటీ లేదు కానీ..ఒకే ఒక్క డైలాగ్ తో అటు రాజకీయాల్లో వేడి పెంచాడు..ఇటు గాడ్ ఫాదర్ సినిమాకి కూడా విపరీతమైన హైప్ ని తీసుకొచ్చాడు.
నిన్న మొన్నటి వరుకు ఈ సినిమాని అధిక రేట్స్ తో థియేట్రికల్ రైట్స్ ని కొనడానికి కాస్త ఆలోచించిన డిస్ట్రిబ్యూటర్స్..ఈరోజు మెగాస్టార్ ఇచ్చిన హైప్ వల్ల సినిమా కచ్చితంగా ఆడుతుంది అనే నమ్మకం తో భారీ స్థాయి రేట్స్ పెట్టి ఈ సినిమాని కొనడానికి ఎగబడుతున్నారు..ట్రేడ్ నుండి అందుతున్నసమాచారం ఏమిటంటే ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 85 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే అన్ని ప్రాంతాలకు కలిపి 110 కోట్ల రూపాయిల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది..ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు 57 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..సాటిలైట్ రైట్స్ కూడా 50 కోట్ల రూపాయలకు పైగానే జరిగిందట..అలా మెగాస్టార్ చిరంజీవి ఒకే ఒక్క డైలాగ్ తో గాడ్ ఫాదర్ సినిమాకి 230 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరిపాడు..మెగాస్టార్ క్రేజ్ అంటే ఇలానే ఉంటుంది..విడుదలకి ముందే ఈ రేంజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 5 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.