
తన గాత్రం తో ఒక్క తెలుగు సినీ పరిశ్రమని కాదు యావత్తు భారత దేశాన్ని మంత్రముగ్దుల్ని చేసిన ప్రముఖ గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం గత కొంత కాలం క్రితం కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే.ట్రీట్మెంట్ తీసుకునే ముందు కూడా ఆయన తన అభిమానులను కంగారు పడవద్దు అని చెప్పి కరోనా పట్ల జాగ్రత్తలు తెలియ చేస్తూ ఒక్క వీడియో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆయన కరోనా నుండి అతి త్వరలోనే కోలుకుంటారు అని అందరూ అనుకున్నారు.కానీ అనుకోకుండా నిన్న ఆయన పరిస్థితి తీవ్రంగా విషమించడం తో ఆయనని ఐ సి యు లో జాయిన్ చేసారు.దీనితో ఒక్కసారిగా యావతి సినీ లోకం ఉలిక్కిపడింది.ఆయన తొందరగా కోలుకోవాలి అంటూ మన లాగే సినీ ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటూ నిన్న ట్విట్టర్ లో ట్వీట్ల వర్షం కురిపించారు.అయితే ఇప్పుడు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం గురించి ఆయన కొడుకు ఎస్ పీ చరణ్ మాట్లాడిన మాటలు అభిమానులకు కొంత ఊరటని ఇస్తోంది
ఆయన మాట్లాడుతూ ‘ఇటీవలే నాన్న ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది,అందుకే ఐ సి యు పెట్టి అత్యవసర చికిత్స చేయిస్తున్నాం.నాన్న గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందొ తెలుసుకోవడానికి సన్నిహితుల నుండి మరియు అభిమానుల నుండి రోజుకు వేల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి.మీ అందరి కోసం ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందొ తెలియచేయడానికి ఈ వీడియో విడుదల చేస్తున్నాను.ఈ వీడియో ని మీ వాట్స్యాప్ గ్రూపుల ద్వారా మరియు మీ సోషల్ మీడియా ద్వారా బాగా షేర్ చెయ్యండి.నాన్న గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుట పడింది.వెంటిలేటర్ నుండి డాక్టర్లకు చాల మంచి రెస్పాన్స్ ఇస్తున్నాడు.ఆయన లంగ్స్ క్రియ నిన్నటి కంటే ఈరోజు ఎంతో బెటర్ గా ఉంది.డాక్టర్లు ఆయన తొందరగా కోలుకుంటారు అని చాల కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.ఆయన ఆరోగ్యం రోజు రోజు కి ఎంతో కోలుకుంటోంది.కాజొట్లాడి మంది అభిమానుల ప్రార్థనలు ఆయనకీ ప్రతి రోజు ఆయుషు పోస్తున్నాయి.మీ అందరి అభిమానానికి మా కుటుంబం జన్మ జన్మలు రుణపడి ఉంటది.మీ ప్రార్థనల వల్ల ఆయన అతి త్వరలో పూర్తిగా కోలుకొని మన ముందుకి వస్తాడు అనే నమ్మకం నాకు ఉంది ‘ అంటూ ఎస్ పీ చరణ్ ఎంతో భావోద్వేగం తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది
అభిమానుల చల్లని దీవెనలు ఉంటే ఎలాంటి ఆపద వచ్చిన కోలుకోవచ్చు అని ఎస్ పీ బాలసుబ్రమణ్యం మరియు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది.
అమితాబ్ బచ్చన్ కూడా ఎన్నోసార్లు చావుతో చెలగాటం ఆడి అజేయుడిగా తిరిగొచ్చిన సందర్భాలు మనం ఇప్పటి వరుకు ఎన్నో చూసాము.ఇటీవల ఆయన కరోనా తో పోరాడి బయటకి వచ్చిన సంగతి కూడా మన అందరికి తెలిసిందే.ఇప్పుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు కూడా అలాగే కోలుకోనున్నారు.అంతే కాకుండా ఐ సి యు నుండి ఆయన థంబ్ రైజ్ చేస్తూ చూపించిన ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఆ ఫోటోని మీరు ఇప్పుడు పైన చూడవచ్చు.ప్రస్తుతం ఆయనకీ ఐ సి యు లో చికిత్స జరుగుతుంది.డాక్టర్లు ఆయనని మాములు స్థితికి తీసుకొని రావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఎస్ పీ గారి ఆరోగ్యం బాగుపడాలి అని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తూ దేవుడికి మొక్కుకుంటున్నారు.ఆయన తొందరగా కోలుకోవాలి అని ,నిండు నూరేళ్లు సుఖం గా బ్రతికి మన అందరిని ఎప్పటిలా అలరిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థిద్దాము