
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ వేడి అందుకున్నాయి..వైసీపీ ప్తభుత్వం పాతికేళ్ల నుండి ఎన్టీఆర్ యూనివర్సిటీ గా పిలవబడుతున్న ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరు ని మారుస్తునట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రబ్యత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది..ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు దేశం పార్టీ నాయకులూ మరియు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నారు..1986 వ సంవత్సరం లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్య మంత్రిగా కొనసాగుతున్న సమయం లో నాణ్యమైన విద్య ప్రతి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి తీసుకొచ్చే గొప్ప ఆలోచనతో ఈ యూనివర్సిటీ కి శంకుస్థాపన చేసాడు..నేడు ఈ యూనివర్సిటీ భారత దేశం లోనే నాణ్యమైన విద్య ని అందిస్తున్న టాప్ మెడికల్ యూనివర్సిటీలలో ఒకటి గా నిలిచింది..ఈ 25 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి..కానీ ఒక్కరు కూడా ఈ విశ్వ విద్యాలయం కి పేరు మార్చాలనే ఆలోచన చెయ్యలేదు..కానీ మొట్టమొదటిసారి వైసీపీ ప్రభుత్వం ఆ సాహసం చేసింది.
ఎన్టీఆర్ పేరు తీసేసి YSR పేరు పెట్టాల్సిందిగా వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది..దీని తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన వారితో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్త పరిచారు..వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు..రాజకీయాలకు ఎప్పుడూ దూరం గా ఉంటూ వస్తున్నా ఎన్టీఆర్ ఇప్పుడు మొదటిసారిగా ఈ విషయం పై మాట్లాడడం తో మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారిపోయింది..ఎక్కడ చూసిన ఎన్టీఆర్ వేసిన ట్వీట్ గురించే చర్చ సాగుతుంది..ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ మరియు YSR జనాల్లో అశేష ప్రజాదరణ కలిగిన మహానాయకులు..ఈ రకంగా ఎన్టీఆర్ పేరు తొలగించి YSR పేరు పెట్టడం వల్ల YSR గౌరవం పెరగదు..ఎన్టీఆర్ స్థాయి తగ్గదు..విశ్వవిద్యాలయం పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని,తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని చెరిపేయలేరు’ అంటూ ట్వీట్ వేసాడు..ఈ ట్వీట్ నందమూరి అభిమానులను బాగా గుర్తు చేసింది..ఒక్క మాట లో చెప్పాలంటే సొంత అభిమానుల్లోనే ఈ ఒక్క ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ విపరీతమైన వ్యతిరేకతని మూటగట్టుకున్నాడు.
ఎన్టీఆర్ లాంటి యుగ పురుషుడిని YSR లాంటి అవినీతిపరుడితో పోలుస్తావా..నీ తాత గారికి ఇంత అవమానం జరుగుతుంటే ఆయన పేరు పెట్టుకున్న నువ్వు ఈరోజు మరింత అవమానానికి గురి అయ్యేలా చేసావు..ఇక నుండి నీ సినిమాలు మేము చూడము అంటూ సోషల్ మీడియా సాక్షిగా చాలా తీవ్రమైన విమర్శలు చేసారు అభిమానులు..మరో పక్క చంద్ర బాబు నాయుడు మరియు టీడీపీ అధిష్టానం కూడా ఈ ఎన్టీఆర్ వ్యాఖ్యలను చాలా తీవ్రంగా ఖండించారు..మరో పక్క కొంతమంది అభిమానులు మాత్రం ఎవ్వరిని నొప్పించకుండా చాలా సెన్సిబుల్ గా ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబడుతారా..ఆయన ఒక సినీ నటుడు..రాజకీయాలకు ఎలాంటి సంబదండం లేదు..ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడు కూడా అతను కాదు..అతనిని మీ మురికి రాజకీయ కంపులోకి లాగొద్దు..ఆయన ఇలాగె స్పందిస్తారు..ఇష్టముంటే సపోర్ట్ చెయ్యండి..లేకపోతే దొబ్బేయండి అంటూ కొంతమంది ఎన్టీఆర్ ఫాన్స్ కామేంన్స్ చేస్తున్నారు..ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ ని కేంద్రం గా చేసుకున్నాయి అని చెప్పాలి.