Home Movie News ఎన్టీఆర్ ధరించిన ఈ మాస్కు విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఎన్టీఆర్ ధరించిన ఈ మాస్కు విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
1,913

మన టాలీవుడ్ హీరోలను అభిమానులు ఏ స్థాయిలో పూజిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,తమ ఇంట్లో సొంత అన్నయ్య లాగ భావిస్తూ వాళ్ళు అనుసరించే ప్రతి ఒక్క పనిని ఆచరిస్తూ ఉంటారు, ముఖ్యంగా వాళ్ళు వాడే వస్తువులకు గాని దుస్తులకు కానీ బయట మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తమ అభిమాన హీరో ధరించిన దుస్తులను కొనడానికి వేలకి వేలు పెట్టి కొనడానికి కూడా వెనకాడరు,అనేక షో రూమ్స్ లో కూడా హీరోలు వాడే దుస్తులను తయారు చేయించి వాళ్ళ క్రేజ్ ని కాష్ చేసుకొని బిజినెస్ చేసుకోడానికి చూస్తుంటారు, ఇప్పుడు టాలీవుడ్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ వాడే మాస్కు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది,ఇప్పడూ ఎక్కడ చూసిన దీని గురించే చర్చ, ఎన్టీఆర్ కి మాస్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అయన ఏమి చేస్తే అది అభిమానులు అనుసరిస్తుంటారు, ఇప్పుడు ఎన్టీఆర్ వాడే మాస్కు కూడా మార్కెట్ లోకి రావడం తో దానిని కొనేదానికి అభిమానులు ఎగబడుతున్నారు, అసలు ఆ మాస్కు ధర ఎంతో తెలిస్తే మీరందరు నోరెళ్లబెట్టక తప్పదు, ఒక్కసారి ఈ మాస్క్ స్టోరీ ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే ప్రముఖ యూఎస్ స్పోర్ట్స్ కంపెనీ విడుదల చేసిన ఈ మాస్కు ధర అక్షరాలా 2340 రూపాయిలు,ఇది లేటెస్ట్ గా మన ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది ,జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఈ మాస్క్ ని ధరించడం మొదలు పెట్టాడో ,అప్పటి నుండి ఈ మాస్కు సేల్స్ ఒక్క రేంజ్ లో ఊపందుకుంది,ఒక్క విధంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ఆ బ్రాండ్ కి ఫ్రీ పబ్లిసిటీ చేసాడు అని చెప్పొచ్చు, ఇప్పుడు మార్కెట్ లో ఈ మాస్కు కి ఉన్న క్రేజ్ వేరు,ఇలా టాలీవుడ్ ప్రముఖ హీరోల దుస్తులు మరియు గాడ్జెట్స్ కొనడానికి అభిమానులు ఎగబడుతున్నారు, ఇక త్వరలో విడుదల కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన దుస్తులకు కూడా మంచి గిరాకీ ఉంది, ఇటీవల విడుదల అయినా వకీల్ సాబ్ సినిమా పోస్టర్ పై పవన్ కళ్యాణ్ వేసుకున్న షర్ట్ ఇప్పుడు పెద్ద పెద్ద బట్టల షో రూమ్ లలో కూడా అందుబాటులోకి వచ్చింది, అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం లో వాడే దుస్తులు కూడా అందుబాటులోకి వచ్చేసాయి, ఇలా టాలీవుడ్ కి చెందిన ప్రముఖుల హీరోల దుస్తులు మాస్కులను కొనడానికి అభిమానులు ఎగబడుతున్నారు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపిస్తుండగా , రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా కనిపిస్తున్నాడు,వీళ్లిద్దరికీ సంబంధించిన టీజర్స్ ఇటీవలే విడుదల అయ్యి సంచలనం సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే,ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 12 న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది, ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా, గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సామెత చిత్రం భారీ విజయం సాధించింది,ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ కే జీ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా ఒక్క సినిమా చేయనున్నాడు, వీటితో పాటు ఎన్టీఆర్ త్వరలో జెమినీ టీవీ లో ప్రసారం అవ్వబోతున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు,ఇటీవలే ఈ ప్రోగ్రాం కి సంబదనించిన యాడ్ కూడా షూట్ చేసారు,ఈ యాడ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు, గతం లో స్టార్ మా లో ప్రసారం అయినా బిగ్ బాస్ సీసన్ 1 కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఆయన యాంకరింగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ ఇంత కాలం తర్వాత ఎన్టీఆర్ మరోసారి యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేయనున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పట…