
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత కొరటాల శివ ఉంటాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను కొరటాల శివ అందుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కించిన ఆచార్య అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి కారణం కొరటాల శివ పేలవమైన దర్శకత్వమే కారణమని మెగా అభిమానులు విమర్శలు చేశారు. అటు పలు సినిమా ఈవెంట్లలోనూ చిరంజీవి పరోక్షంగా కొరటాల శివపై సెటైర్లు వేశారు. పూర్తి స్క్రిప్ట్ తయారుచేయకుండా ఆచార్య సినిమాను కొరటాల శివ సెట్స్ పైకి తీసుకెళ్లాడని చిరు కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టపోవడంతో తిరిగి చెల్లించాలని కొరటాల శివ ఇంటి దగ్గర పలువురు ధర్నాకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, కొరటాల శివ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కట్ చేస్తే ఇప్పుడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ 30గా ఈ మూవీ రూపొందనుంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించడంతో ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి చిరంజీవి ఓకే చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరై కొరటాల శివతో తనకు విభేదాలు లేవని మీడియా సాక్షిగా చెప్పాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించనుంది. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఈ సినిమాను మించి కొత్త సినిమాను దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.
అటు ఆర్.ఆర్.ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో కొరటాల శివ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్‌లో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. ఈ మూవీ అతడి స్థాయిని మరింత పెంచేలా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌లోని నటుడిని మరింత కొత్తగా పరిచయం చేయాలని కొరటాల భావిస్తున్నాడట. మరోవైపు ఎన్టీఆర్ 30 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవ ఈవెంట్ కోసం ఆర్.ఆర్.ఆర్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేసి 2024 ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల దర్శకుడు కొరటాల శివ ప్రకటించడం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఆచార్య సినిమా జ్ఞాపకాలను ఈ మూవీతో తుడిచేయాలని దర్శకుడు పట్టుదలతో కనిపిస్తున్నాడు.