
ఇటీవల కాలం లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కలకలం రేపిన అంశం నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకున్న సంఘటన..నందమూరి లాంటి దిగ్గజ కుటుంబం నుండి ఒకరు ఆత్మహత్య చేసుకోవడం అంటే మాములు విషయం కాదు..ఎందుకంటే సినిమాల పరంగా రాజకీయ పరంగా ఎవ్వరికి అందనంత ఎత్తు లో ఉన్న కుటుంబం అది..ఆర్ధిక ఇబ్బందులు వీళ్ళ దరిదాపుల్లోకి కూడా రాదు..ప్రతి ఒక్కరు కొడుకులు కూతుర్లు మనవాళ్ళు మానమరాళ్ళతో ఎంతో సుఖవంతమైన జీవితం గడుపుతున్నారు..అలాంటి కుటుంబం లో ఉన్న ఒక వ్యక్తి అది కూడా సాక్ష్యాత్తు శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆత్మ హత్య చేసుకోవాల్సిన ఖర్మ ఏమిటి అనే సందేహం మరియు బాధ నందమూరి అభిమానుల్లో నెలకొంది..మరోపక్క ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు టీడీపీ పార్టీ వాళ్ళే ఎదో చేసారని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో ఒక హాష్ టాగ్ మీద గత రెండు రోజుల నుండి ట్రెండ్ చేస్తున్నారు..అయితే వీటిల్లో నిజానిజాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ముందుగా ఒక కుటుంబం లో ఏదైనా విషాద సంఘటన జరిగితే సానుభూతి చూపించడం కనీసం ఉండాల్సిన మానవత్వ విలువలు..కానీ ఇటీవల కాలం లో రాజకీయాలు అత్యంత నీచంగా దిగజారిపోయ్యాయి..చనిపోయిన వారి కుటుంబం బాధ పడుతుంది అనే కనీస ఇంకిత జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు..ఉమా మహేశ్వరీ గారి ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ ని పెళ్లాడారు..అతని పేరు శ్రీనివాస ప్రసాద్..వీళ్లిద్దరికీ ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు..ఆర్థికంగా కూడా వీళ్ళ కుటుంబం ఎంతో గొప్పగా స్థిరపడింది..రాజకీయాలకు గాని..సినీ పరిశ్రమ కి గాని ఈ కుటుంబం దూరంగా ఉంటూ వస్తుంది..ఎలాంటి నెగటివిటీ కూడా వీళ్ళ ఇంటి గడప కూడా తొక్కి ఉండదు..అలాంటి వారికి అన్యాయం చెయ్యాలని చంద్రబాబు నాయుడు కానీ..ఆయన కుమారుడు కానీ ఎందుకు అనుకుంటారు?? కనీసం కామన్ సెన్స్ తో ఆలోచించే విషయం ఇది..ఉమా మహేశ్వరీ గారికి కేవలం 51 సంవత్సరాలు మాత్రమే..చనిపొయ్యే వయస్సు అసలు కాదు..ఇంకా ఆమె జీవితం లో చూడాల్సినివి ఎన్నో ఉన్నాయి..అలాంటి వ్యక్తి చనిపోయినందుకు సానుభూతి తెలపడం బదులు ఆమె చావుని అడ్డం పెట్టుకొని రాజకీయం చెయ్యడం ఎమన్నా సమంజసమా అనేది ఒక్కసారి ఆలోచించాలి.
ఉమామహేశ్వరి గారు చాలా కాలం నుండి అనారోగ్యం సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు..ఆ బాధని భరించే శక్తి లేక మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు..పోస్టు మార్టం రిపోర్ట్స్ లో కూడా ఆమె ఆత్మహత్య వల్లే చనిపోయింది అని నిర్ధారించారు..అలాంటప్పుడు ఇంకా ఒకరి మీద చావుని అడ్డం పెట్టుకొని కామెంట్స్ చెయ్యడం ఏమైనా సబబా?..ఇటీవలే ఎన్టీఆర్ గారి రెండవ భార్య లక్ష్మి పార్వతి గారు చంద్ర బాబు మీద ఘోరమైన ఆరోపణలు చేసారు..ఉమామహేశ్వరి గారి ఆత్మహత్య లేఖని చంద్రబాబు నాయుడే మాయం చేసాడని..అతని టార్చర్ భరించలేకనే ఉమామహేశ్వరి గారు ఆత్మ హత్య చేసుకున్నారని ఎదో దగ్గరుండి చూసినట్టు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కామెంట్ చేసారు..ఇది చాలా తప్పు..పెద్ద వయసు వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకితం తో మాట్లాడాలి కానీ నోటికి ఏది వస్తే అది ఒకరి మీద అక్కసుతో కామెంట్స్ చెయ్యడం చాలా విచారకరం..ఏది ఏమైనా వాళ్ళ లాగ మనం ఉండలేము కాబట్టి ఉమామహేశ్వరి గారి ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి ప్రార్థన చేద్దాము.