
ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లో కలకలం రేపిన అంశం స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వరి గారు ఆత్మా హత్య చేసుకొని చనిపోయిన ఘటన..సినిమా ఇండస్ట్రీ పరంగా మరియు రాజకీయ పరంగా శాసించే స్థాయిలో ఉన్న నందమూరి కురుంబనికి చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యి ఉంటె ఆమె అలా చేసి ఉంటుంది అని నందమూరి అభిమానులు తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నారు..అసలు నిజంగా ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకున్నారా..లేదా ఆమెని ఎవరైనా హత్య చేసారా అనే కోణం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..ఆమె ఎంతో కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..ఇన్ని రోజులు ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆలోచన రాని ఆమె సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ పోలీసులు ఆరాతీస్తున్నారు..నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఉమామహేశ్వరి చాలా ఆత్మా ధైర్యం గల మనిషి అని..ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బలంగా నిలబడగలడు అని..అసలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి తనం మా నందమూరి వంశ కుటుంబం లోనే లేదని..కానీ ఉమామహేశ్వరి గారు ఎలా ఆత్మహత్య చేసుకోగలిగారు అని ఇప్పటికి ఆశ్చర్యం గా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు.
ఇది ఇలా ఉమా మహేశ్వరు గారు పార్థివ దేహానికి పోస్టు మార్టం జరిపించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పోస్టు మార్టం రిపోర్ట్ లో బయటపడిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ పోస్టు మార్టం వివరాలు ఏమి తెలుపుతున్నాయి అంటే ఉమా మహేశ్వరీ గారు ఆస్త్మా హత్య వల్లే చనిపోయారని..ఆమెని ఎవరు హత్య చెయ్యలేదని చెప్పుకొచ్చారు..ఆమె గర్భకోశం లో కూడా ఎలాంటి విష పదార్దాలు దొరకలేదు అని..హత్య అని అనుమానాస్పదంగా చూడాల్సిన ఒక్క రిపోర్టు కూడా దొరకలేదని ఆ పోస్టు మార్టం రిపోర్టు లో వచ్చిందట..కానీ మన ఆంధ్ర ప్రదేశ్ లో కుళ్ళు రాజకీయాలు ఎలా ఉంటాయో మన అందరికి తెలిసిందే..ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి ఎవరైనా ఇలా అనుమానాస్పదంగా చనిపోతే పలానా వ్యక్తి
హత్య చేయించారు అంటూ కామెంట్స్ చేస్తారు..అసలే శోకసంద్రం లో మునిగిపోయిన కుటుంబానికి మరింత భారం తో కూడిన శోకాన్ని ఇస్తారు..ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రత్యర్థి పార్టీ కి చెందిన అభిమానులు ‘హూ కిల్లెద్ పిన్ని’ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చెయ్యడం ప్రారంభించారు..అంటే చంద్రబాబు నాయుడే ఈ పనులు చేయించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతం లో కూడా జగన్ గారి బాబాయి వై ఎస్ వివేకానంద గారి హత్య జరిగినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగాయి..ప్రత్యర్థి పార్టీ కి చెందిన అభిమానులు ‘హూ కిల్లెద్ బాబాయి’ అంటూ ట్రెండ్స్ చేసేవారు..మనిషి జీవితం లో ఎంతో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి అంతిమ యాత్ర ..జీవితం లో బంధాలు,అనుబంధాలు ,కష్ట సుఖాల నుండి విముక్తి తీసుకొని చేసిన కర్మల ద్వారా స్వర్గానికో లేదా నరకానికో ప్రయాణం అయ్యే అతి ముఖ్యమైన ఘట్టం ఇది..అలాంటి అతి ముఖ్యమైన ఘట్టం లో మన ఆత్మా ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటివి జరిగితే తీవ్రమైన అశాంతికి గురి అవుతుంది..మనుషులు అన్నాక కాస్త అయినా మానవత్వం ఉండాలి కదా అంటూ కొంతమంది నెటిజెన్ల రాజకీయ నాయకుల పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..ఏది మైన ఆమె ఆత్మా ఎక్కడ ఉన్న శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.