
టాలీవుడ్ లో పాతికేళ్ల నుండి ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట శ్రీకాంత్ – ఊహా..శ్రీకాంత్ తన కెరీర్ ప్రారంభం లో ఊహ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు..ఆ సందర్భంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించి అతిరధ మహారథుల సమక్షం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు..వీళ్లిద్దరికీ ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు కూడా ఉన్నాడు..కొడుకు రీసెంట్ గా పెళ్లి సందడి అనే సినిమా ద్వారా హీరో గా పరిచయమై తోలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇలా కొడుకు సక్సెస్ ని చూసిన తర్వాత వీళ్లిద్దరు విడిపోయారంటూ వార్తలు రావడం శ్రీకాంత్ ని అభిమానించే వారిని బాగా డిస్టర్బ్ చేసింది..సోషల్ మీడియా లో నిన్న ఈ వార్త సెన్సేషన్ సృష్టించడం తో ఈరోజు శ్రీకాంత్ వెంటనే స్పందించాడు..తనకి సంబంధించిన ఏ విషయం గురించైనా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చే శ్రీకాంత్ విడాకుల వార్తపై కూడా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘తిన్నది అరగక తప్పుడు ప్రచారాలు చేసే వెబ్ సైట్స్ , యూట్యూబ్ చానెల్స్ ఈమధ్య ఎక్కువ అయిపోయాయి..నా మీద మాత్రమే కాదు..ఇతర సెలబ్రిటీస్ మీద కూడా ఇలాంటి పుకార్లు ఆగడం లేదు..ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే వాళ్లకి ఏమి వస్తుందో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు..దయచేసి పోలీసులు సైబర్ క్రైమ్ యాక్ట్ ద్వారా ఇలాంటి స్క్రాప్ వార్తలు రాసే వెబ్ సైట్స్ మరియు యూట్యూబ్ చానెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ శ్రీకాంత్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..గతం లో కూడా సోషల్ మీడియా లో ఇలాంటి వార్తలు ప్రచారం అవ్వడం వల్ల కొంతమంది సెలెబ్రిటీలు బాగా హర్ట్ అయ్యారు..సమంత స్థాయి స్టార్ హీరోయిన్ కూడా హై కోర్ట్ లో పలు యూట్యూబ్ చానెల్స్ పై కేసు వేసింది..ఇప్పుడు శ్రీకాంత్ కూడా సైబర్ క్రైమ్ యాక్ట్ ద్వారా ఆయా వెబ్ సైట్స్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యబోతున్నాడు.
ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే హీరో గా గొప్ప సక్సెస్ లను చూసిన ఆయన ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు గా కూడా మంచి సక్సెస్ ని చూస్తున్నాడు..గత ఏడాది నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ద్వారా విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు..జగపతి బాబు లాగ విలన్ గా గొప్పగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అఖండ సినిమాలోని పాత్ర ఆయనకీ పెద్దగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టలేదు..దీనితో మళ్ళీ ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగానే స్థిరపడనున్నాడు..శ్రీకాంత్ హీరో రోల్స్ కి మరియు సాఫ్ట్ రోల్స్ కి మాత్రమే పనికి వస్తాడని..విలన్ రోల్స్ కి సూట్ అవ్వడంటూ అఖండ సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ కలిగింది..ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ – వంశి పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటుగా రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నాడు.