
టాలీవుడ్ లో ఇటీవల కాలం లో ఒక లేటెస్ట్ ట్రెండ్ ప్రారంభం అయ్యింది..గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు రెండు తెలుగు రాష్ట్రాలలో గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ వేశారు..దీనికి ఫాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..దాదాపుగా 13 షోలు వేస్తె అన్నీ హౌస్ ఫుల్స్ వచ్చాయి..ఇక పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని చూసి మహేష్ బాబు ఫాన్స్ దూకుడు సినిమా స్పెషల్ షోస్ వేసుకున్నారు..ఇక తర్వాత మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ఘనంగా ప్లాన్ చేసారు..అదే రోజు ఒక్కడు సినిమాని కూడా వేసుకున్నారు..రెండు సినిమాలకు ఒక్క రేంజ్ హౌస్ ఫుల్స్ పడ్డాయి..ఎక్కడ చూసిన ఈ రెండు సినిమాల స్పెషల్ షోస్ గురించే మాట్లాడుకోవడం జరిగింది..అలా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ప్రపంచవ్యాప్తంగా 350 కి పైగా పడగా, ఒక్కడు సినిమాకి 23 స్పెషల్ షోస్ పడ్డాయి..ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ సెప్టెంబర్ 2 వ తేదీన జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్లాన్ చేసారు..వాళ్ళు 350 షోస్ వేసుకుంటే మేము 500 షోస్ వేస్తాము అంటూ సవాలు విసిరారు.
అనుకున్న విధంగానే జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ఘనంగా ప్లాన్ చేసుకున్నారు..అమెరికా నుండి అనకాపల్లి వరుకు రీసౌండ్ వచ్చే రేంజ్ లో రికార్డు స్థాయి షోస్ ని ప్లాన్ చేసారు..అయితే సెప్టెంబర్ 2 వ తేదీ రెండు కొత్త సినిమాలు ఉండడం తో సెప్టెంబర్ 1 వ తేదికి ప్రోగ్రాం మార్చి భారీ స్థాయి షోస్ పెంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు..ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ ని చూస్తే మెంటలెక్కిపోక తప్పదు..కేవలం హైదరాబాద్ నుండే ఈ సినిమా కి వందకి పైగా షోస్ యాడ్ చేసారు..ప్రస్తుతానికి 30 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ జరగగా కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్ నుండే ఈ సినిమాకి ఇప్పటి వరుకు 16 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..ఇక్కడ పోకిరి సినిమాకి 8 లక్షల రూపాయిలు మరియు ఒక్కడు సినిమాకి 8 లక్షల రూపాయిలు వచ్చాయి..ఈ గ్రాస్ ని కేవలం జల్సా సినిమా మార్జిన్ తో దాటేయడం ఆశ్చర్యార్ధకం.
తమ్ముడు సినిమాకి కూడా జల్సా రేంజ్ లోనే భారీ లెవెల్ లో షోస్ ప్లాన్ చేసారు..దానికి కూడా అద్భుతమైన ఆక్యుపెన్సీ రావడం విశేషం..మొత్తం మీద హైదరాబాద్ షోస్ లో జల్సా ఇప్పటికే 30 లక్షల రూపాయిల గ్రాస్ ని దాటేసింది..పోకిరి సినిమా స్పెషల్ షోస్ ముందు రోజు తెలంగాణ మొత్తం కలిపి 55 లక్షల రూపాయిల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వసూలు చేసింది..కానీ జల్సా సినిమా ఆ మార్కుని స్పెషల్ షోస్ ప్రారంభం అయ్యే మూడు రోజుల ముందే అందుకునే అవకాశం ఉంది..ఇక తమ్ముడు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది..ఈ సినిమా కి ఇప్పటి వరుకు 20 లక్షల రూపాయిల వరుకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..పోకిరి సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 షోస్ కి గాను కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..కానీ జల్సా సినిమా ఈ మొత్తాన్ని కేవలం నైజాం ప్రాంతం నుండే వసూలు చేసే అవకాశం ఉందంటూ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.