
తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..ఇప్పటికే 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టి 60 రోజులు పూర్తి చేసుకుంది..ఈ 60 రోజుల్లో 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు..వారిలో టాప్ 5 కంటెస్టెంట్స్ లో పోటీపడగల సత్తా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు..గీతూ, సూర్య మరియు అర్జున్ కళ్యాణ్ వంటి వారు ఆ కోవకి చెందిన వారే..వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం తో బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం అన్యాయంగానే నడుస్తుంది అనే భావన ప్రేక్షకుల్లో కలిగింది..ఇక పదవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైనా ఇంటి సభ్యులు రేవంత్ , శ్రీహన్ , ఫైమా, ఇనాయ, బాలాదిత్య, ఆదిరెడ్డి , ఇనాయ , కీర్తి , వాసంతి వంటి వారు నామినేట్ అయ్యారు.
వీరిలో వోటింగ్ పరంగా అందరికంటే తక్కువ ఉన్న కంటెస్టెంట్ వాసంతి..న్యాయంగా అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వాసంతి బయటకి వెళ్ళాలి..కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రేవంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి..ఎందుకంటే రేవంత్ ఫిజికల్ టాస్కులలో అగ్రెస్సివ్ గా ఆడడం వల్ల ఇంటి సభ్యులు ఫిజికల్ గా బాగా దెబ్బతింటున్నారు..అంతే కాకుండా మాటలు కూడా నోటికి ఏది వస్తే అది అనేస్తాడు..నాగార్జున గారు గత వీకెండ్ లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చెయ్యకు అంటూ రోహిత్ కి యెల్లో కార్డు ఇచ్చి వార్నింగ్ ఇస్తాడు..మరో ఇదే రిపీట్ చేస్తే రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేస్తాము అని హెచ్చరికలు జారీ చేసాడు..కానీ రేవంత్ ఈ వారం కూడా అతను ఆడిన ఫిజికల్ టాస్కు గేమ్ వల్ల చాలా మంది ఇంటి సబ్యులకు దెబ్బలు తాకాయి..అది ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.
ఒక పక్క ఆదిరెడ్డి ఫిజికల్ అవుతుంది అని రేవంత్ కి వార్నింగ్ ఇచ్చినా కూడా రేవంత్ ఎక్కడ తగ్గకుండా ఫిజికల్ గా ఆడుతాడు..ఇది ఆయన పై ఈ వారం తీవ్రంగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది..నాగార్జున గారు రెడ్ కార్డు ఇచ్చి రేవంత్ ని బిగ్ బాస్ నుండి తరిమేస్తారు అనే రూమర్..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి..ఎందుకంటే గడిచిన కొద్దీ వారల నుండి బిగ్ బాస్ లో అన్ని ఊహించనివే జరుగుతున్నాయి..ఈ వారం కూడా అలాంటిదే జరుగుతుందని చెప్తున్నారు..గత వారం గీతూ ఎలిమినేషన్ ప్రేక్షకులకు మరియు ఇంటి సబ్యులకు ఎలాంటి షాక్ అనేది మన అందరికి అనుభవం అయ్యింది..ఆమెని ఇష్టపడని వాళ్ళు కూడా అయ్యో పాపం అని ఫీల్ అయ్యారు..రేవంత్ విషయం లో కూడా అలాగే జరుగుతుందని అనుకున్నారు..కానీ రేవంత్ లాంటి నెంబర్ 1 కంటెస్టెంట్ ని ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ పై గట్టి ప్రవభం పడే అవకాశం ఉంది.