Home Entertainment ఈ వారం ఇనాయ అవుట్..బిగ్ బాస్ హిస్టరీ లో ఇలాంటి మోసం ఎప్పుడు జరగలేదు!

ఈ వారం ఇనాయ అవుట్..బిగ్ బాస్ హిస్టరీ లో ఇలాంటి మోసం ఎప్పుడు జరగలేదు!

0 second read
0
0
738

బిగ్ బాస్ సీజన్ 6 లాంటి డిజాస్టర్ ఫ్లాప్ షో భవిష్యత్తులో ఏ బిగ్ బాస్ సీజన్ కి కూడా రాదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ ప్రజలకు ముఖ పరిచయం లేనోళ్లే..అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ ప్రారంభం ఎపిసోడ్ నుండే దారుణంగా ఉన్నాయి..ఇక ఉన్న కంటెస్టెంట్స్ అయిన బాగా ఆడుతారు అంటే అదీ లేదు..ఒక్క రేవంత్ మరియు శ్రీహాన్ మినహా కోనెటస్టెంట్స్ అందరూ ఎదో హాలిడే ట్రిప్ కి వచ్చినట్టు ప్రవర్తించారు ప్రారంభం లో..ఆ తర్వాత అక్కినేని నాగార్జున ఇచ్చిన కోటింగ్ వల్ల కంటెస్టెంట్స్ లో చురుకుదనం మొదలైంది..బిగ్ బాస్ కూడా టీఆర్ఫీ రేటింగ్స్ కోసం టాస్కుల విషయం లో కొత్తగా ఆలోచించాడు..అవి బాగానే వర్కౌట్ అయ్యింది..కానీ జరగాల్సిన నష్టం మొత్తం ప్రారంభ ఎపిసోడ్స్ లోనే జరిగిపోయింది..అప్పటి నుండి రేటింగ్స్ పెంచడం కోసం ట్విస్టులు ఇవ్వడం ప్రారంభించారు..కొంత వరుకు ఆ ట్విస్టులు వర్కౌట్ అయ్యాయి కానీ ట్విస్టుల మోతాదు ఎక్కువై ప్రేక్షకుల చేత చివాట్లు రప్పించుకుని స్థాయికి దిగజారిపోయ్యారు.

ఎవ్వరు ఊహించని కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి..బిగ్ బాస్ ని రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు తర్వాత ఏమి జరుగుతుంది అనే ఆత్రుత ని కలిగించే ప్రయత్నం చేసాడు బిగ్ బాస్..అలా టాప్ 5 లోకి వచ్చే సత్తా ఉన్న కంటెస్టెంట్స్ ని వరుసగా ఎలిమినేట్ చేస్తూ వచ్చాడు బిగ్ బాస్..అలా ఈ వారం కూడా ప్రేక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయ్యే ట్విస్ట్ బిగ్ బాస్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది..అందులో ఓటింగ్స్ లో టైటిల్ విన్నర్ రేంజ్ ఓట్లను దక్కించుకుంటున్న ఇనాయ ని బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..ఓటింగ్ లైన్ ప్రకారం ఈ వారం బాటమ్ లో ఉన్న టాప్ 2 కంటెస్టెంట్స్ శ్రీ సత్య మరియు కీర్తి..డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయిపోతారు..లేదా శ్రీ సత్య మరియు కీర్తి లలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ అనుకున్నారు..కానీ మన అంచనాలకు బిన్నంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న ఇనాయ ని తొలగించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంత అన్యాయంగా ఈ సీజన్ కొనసాగుతుంటే మాత్రం తదుపరి సీజన్స్ పై ప్రేక్షకులు పూర్తిగా చూడడం మానేస్తారు..ఫలితంగా బిగ్ బాస్ తెలుగు కి సీజన్ 6 చివరి సీజన్ అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుద్ది..ఇనాయ ఎలిమినేషన్ ఈ వారం జరిగితే జరగబొయ్యేది అదే..మరి బిగ్ బాస్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి..ఇనాయ కి సోషల్ మీడియా ఆడపులి అనే బిరుదు ఉంది..టాస్కులు ఆడడం లో కానీ..గొడవలు పడడం లో కానీ ఇనాయ హౌస్ మేట్స్ అందరూ తన మీద దాడికి దిగిన పోరాడగలడు..అందుకే ఆమెకి ఈమధ్య సోషల్ మీడియా లో ఫాలోయింగ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది..మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఈమె.. అంచలంచలుగా తన గేమ్ తీరుని డెవలప్ చేసుకున్న విధానం రాబొయ్యే సీజన్ కంటెస్టెంట్స్ కి కూడా ఆదర్శం..అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలని కోరుకుందాం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…