
ప్రస్తుతం సోషల్ మీడియాకు జనాలు బాగా అలవాటు పడ్డారు. దీంతో ఈజీ మనీ కోసం తాపత్రయపడుతున్నారు. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు అని వాట్సాప్‌లలో సందేశాలు వస్తే ఏ మాత్రం సంకోచించకుండా ఓపెన్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్‌ల ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ కాంటెస్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తోంది. దీంతో చాలా మంది నటీనటుల పాత ఫోటోలు, చిన్ననాటి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పాలబుగ్గలతో, క్యూట్ స్మైల్‌తో ఉన్న చిన్నారి ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ హీరోయిన్‌ను గుర్తుపడితే రూ.లక్ష బహుమానం మీదేనని ఓ ప్రముఖ మీడియా ఛానల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. అయితే కొన్ని క్లూలను కూడా నెటిజన్‌లకు ఇచ్చింది.
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరైందని క్లూ ఇచ్చింది. ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉందని తెలిపింది. దీంతో ఆ హీరోయిన్ ఎవరంటూ నెటిజన్‌లు తెగ ఆలోచిస్తున్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు విజయ్ దేవరకొండకు జోడీగా టాక్సీవాలా చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్. ఆమె చూడ్డానికి ముంబై భామలా కనిపించినా.. కేరాఫ్ అనంతపురమే. పుట్టింది పెరిగింది అంతా రాయలసీమలోనే. బీటెక్ కూడా రాయలసీమలోనే చదివింది. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక జవాల్కర్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరింపచేస్తుంది. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంది. మొత్తానికి ప్రియాంక జువాల్కర్ చిన్న నాటి ఫోటో కూడా ఇప్పుడు నెటిజన్‌లకు కాసుల వర్షం కురిపించబోతుందని టాక్ వినిపిస్తోంది.
గత ఏడాది ప్రియాంక జువాల్కర్ పలు సినిమాల్లో నటించింది. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణ మండపం, శ్రియ కీలక పాత్ర పోషించిన గమనం వంటి చిత్రాలతో ప్రియాంక జువాల్కర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా గమనం అనే సినిమాలో ప్రియాంక ఒక ముస్లిం అమ్మాయి పాత్రలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా.. ప్రియాంక పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మరొక్క హిట్ పడితే టాప్ లీగ్ లోకి దూసుకెళ్లే గ్లామర్ ప్రియాంక సొంతం అని చెప్పాలి. మరోవైపు ప్రముఖులతో అఫైర్లు నడపడంలో కూడా ప్రియాంక దిట్టే అని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్‌తో ప్రియాంక జవాల్కర్ డేటింగ్ చేస్తోందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో ప్రియాంక షేర్ చేసిన ఫోటోలకు వెంకటేష్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో నిప్పు లేనిదే పొగ రాదంటూ నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.