
ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారుగా 10 లక్షల మంది హాజరైన ఈ పరీక్షలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 61 శాతం పాస్ అవ్వగా, రెండవ సంవత్సరం ఫలితాలలో 72 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే ఈ ఫలితాలలో ఫెయిల్ అయినా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రమైన బాధ కి గురి అయ్యేలా చేసింది. శ్రీకాకుళం కి చెందిన 17 ఏళ్ళ కుర్రాడు రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ ఘటన తీవ్రమైన విషాదం లోకి నెట్టేసింది. ఇతను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి, మొన్న విడుదల చేసిన ఫలితాలలో అత్యధిక సబ్జక్ట్స్ లో ఫెయిల్ అవ్వడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
మరో పక్క త్రినాధపురం లోని మల్కాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకోవడాన్ని పోలీసులు గమనించారు. పరిస్థితి ఏమిటి అని ఆరా తియ్యగా, ఇంటర్మీడియట్ లో అత్యధిక సబ్జక్ట్స్ ఫెయిల్ అవ్వడం వల్లే ఇలా చేసుకుందని అంటున్నారు. ఈ చిన్నారి విశాఖపట్నం కి చెందిన అమ్మాయిగా పోలీసులు గుర్తించారు, అదే విశాపట్నం జిల్లాలో కంచెరపాలెం ప్రాంతం లో మరో 18 ఏళ్ళ అబ్బాయి ఉరి వేసుకొని చనిపోయిన ఘటన సంచలనం కలిగించింది. ఇతను ఇంటర్ సెకండ్ ఇయర్ లో కేవలం ఒకే ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయ్యాడనే నిరాశలో ఆత్మహత్య చేసుకున్నాడట. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఇద్దరు 18 ఏళ్ళ వయస్సు ఉన్న విద్యార్థులు ఇంటర్ లో ఫెయిల్ అయ్యారనే మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అమ్మాయి అయితే పురుగుల మందు తాగి చెరువు లో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఇక అనకాపల్లి కి చెందిన ఒక అబ్బాయి ఇంటర్ లో మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం తో ఉరి వేసుకొని చనిపోయాడు. ఇలా ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులందరూ కేవలం ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాము అనే బాధలో ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం, కేవలం ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యామని ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎంత వరకు సబబు, ఇందులో ఆ పిల్లల తప్పు ఏమాత్రం లేదు. చిన్న వయస్సు లో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు, వాళ్ళని తల్లితండ్రులు ఎల్లప్పుడూ కనిపెట్టుకుంటూ ఉండాలి, వాళ్లకి తగిన ధైర్యం, ఉత్తేజం నింపాలి, ఇంటర్ లో ఫెయిల్ అయినా ఎంతో మంది నేడు వ్యాపార రంగం లో గొప్పగా రాణించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సినిమా స్టార్స్ గా కూడా ఎదిగారు, జీవితం ఎన్నో మార్గాలు చూపిస్తుంది, తల్లితండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి అని కొంత మంది విశ్లేషకులు చెప్తున్నారు.