Home Entertainment ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా..?

ఈ ఏడాది అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏమిటో తెలుసా..?

4 second read
0
0
1,879

కరోనా కారణంగా కుదేలు అయిపోయిన తెలుగు సినిమా పరిశ్రమ కి ఇటీవల విడుదల అయినా సినిమాలు అన్ని ఊపిరి పోశాయి..అఖండ సినిమా తో ప్రారంభం అయినా మన టాలీవుడ్ జైత్ర యాత్ర మొన్న విడుదల అయినా KGF చాప్టర్ వరుకుకి కొనసాగింది..మధ్యలో విడుదల అయినా ప్రభాస్ రాధే శ్యామ్ మరియు ఇటీవలే విడుదల అయినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరపరాజయాలు పాలయ్యాయి..ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చినప్పటికీ,చిరంజీవి ఆచార్య సినిమా మాత్రం ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరుకు ట్రేడ్ వర్గాల అంచనాలు అన్నిటిని తలకిందులు చేసేసింది..ఇది పక్కన పెడితే ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల అయినా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, రాజమౌళి #RRR మరియు KGF చాఫ్టర్ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలిచి నిర్మాతలకు మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల కనకవర్షం కురిపించాయి..#RRR అయితే 40 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటికి కొన్ని చోట్ల హౌస్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది..విడుదల అయినా రోజు నుండి ఈరోజు వరుకు ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అన్నిటికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ముందుగా ఫిబ్రవరి 25 వ తారీఖున భారీ అంచనాల నడుమ విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే , మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా అమెరికా నుండి అనకాపల్లి వరుకు ఒక్క రేంజ్ రీ సౌండ్ వచ్చేలా చేసింది..ఆంధ్రప్రదేశ్ లో అన్ని సినిమాలకు ఉన్నట్లు గా ఈ సినిమాకి ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచుకోడానికి అనుమతి ఇవ్వకపోయినా కూడా పవర్ స్టార్ తన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ తో రికార్డు స్థాయి ఫుల్స్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు..మొదటి రోజే ఈ సినిమాకి దాదాపుగా 20 లక్షల టికెట్స్ అమ్ముడుపోగా ఫుల్ రన్ లో దాదాపుగా 80 నుండి 90 లక్షల టికెట్స్ అమ్ముడుపోయి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక ఈ సినిమా తర్వాత బాక్స్ ఆఫీస్ ని ఒక్క రేంజ్ లో ఊపేసిన #RRR సినిమాకి మొదటి రోజే మన ఇండియా లో అన్ని భాషలకు కలిపి దాదాపుగా 58 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోగా, ఫుల్ రన్ లో ఇప్పటి వరుకు ఈ సినిమాకి 2 కోట్ల రూపాయిల టికెట్స్ కి పైగా అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఇక ఈ రెండు సినిమాలు తర్వాత విడుదల అయినా KGF చాప్టర్ 2 సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ కన్నడ దబ్ సినిమా విడుదల అయినా ప్రతి భాషలో కూడా సంచలన విజయం సాధించింది..మొదటి రోజు దాదాపుగా ఈ సినిమాకి కూడా దాడుపుగా 50 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి అట..ఫుల్ రన్ లో ఇప్పటి వరుకు ఈ సినిమాకి ఒక్క కోటి 50 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక ఇటీవలే విడుదల అయినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకి మొదటి రోజు 15 లక్షల టికెట్స్ మరియు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకి 17 లక్షల టికెట్స్ మొదటి రోజు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఫుల్ రన్ లో ఈ రెండు సినిమాలకి పైన ఉన్న సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి ..ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలకు ఫుల్ రన్ లో 30 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి అని తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…