
ఈ వారం బిగ్ బాస్ మొత్తం కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌస్ లోకి రావడం వాళ్ళతో మాట్లాడడానికే సమయం గడిచిపోతుంది..చాలా కాలం తర్వాత తమకి ఇష్టమైన వాళ్ళని చూసేలోపు కంటెస్టెంట్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..ఇప్పటి వరుకు ఫైమా , ఆది రెడ్డి , రాజ్, శ్రీ సత్య మరియు రోహిత్ కి సంబంధించిన కుటుంబీకులు హౌస్ లోకి రాగా,ఈరోజు శ్రీహాన్ ప్రేయసి సిరి హౌస్ లోకి అడుగుపెట్టింది..సిరి గత సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది..గత సీజన్ లో ఈమె షణ్ముఖ్ జస్వంత్ తో నడిపిన ప్రేమాయణం మరియు అతనితో చేసిన రొమాన్స్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..హౌస్ లోకి అడుగుపెట్టి శ్రీహాన్ తో ప్రేమగా మాట్లాడినా కూడా అది కేవలం బూటకం లాగ చూసే ప్రేక్షకులకు అనిపిస్తుంది..ఎందుకంటే షణ్ముఖ్ తో ఆమె నడిపిన బాగోతం అలాంటిది మరి..ఎప్పటికి ఎవ్వరూ కూడా మర్చిపోలేరు అది.
ఇక ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగానే శ్రీహాన్ ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటుంది సిరి..కాసేపటి తర్వాత వీళ్లిద్దరు దత్తత తీసుకున్న అబ్బాయి హౌస్ లోకి అడుగుపెడతాడు..చాలా రోజుల తర్వాత తన కొడుకుని చూసేలోపు శ్రీహాన్ బాగా ఎమోషనల్ అయిపోతాడు..అలా కాసేపు బావోద్వేగంగా ఈ ఎపిసోడ్ సాగిపోతుంది..ఇక ఆ తర్వాత సిరి ఇంటి సభ్యులందరితో బాగా మాట్లాడుతుంది..’ఏమి ఇనాయ ఈమధ్య మావాడిని పట్టించుకోవడం లేదు’ అని జోక్ చేస్తుంది..ఆ తర్వాత శ్రీ సత్య సిరి తో మాట్లాడుతూ ‘మీ వాడిని నేను అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాను..ఏమి అనుకోకు అని చెప్తుంది’ అప్పుడు సిరి ‘ఎందుకు అనుకోను..కచ్చితంగా అనుకుంటాను’ అని బదులిస్తుంది..అలా మాట్లాడుతూ ఉన్న సమయం లో శ్రీహాన్ శ్రీ సత్య వైపు చూస్తూ ‘ఓయ్ నిన్ను ఒకసారి క్యూట్ అని కూడా అన్నాను..మర్చిపోయావా’ అని అడుగుతాడు..అప్పుడు సిరి మాట్లాడుతూ ‘నువ్వు శ్రీ సత్య ని క్యూట్ అన్నావు కానీ ఇప్పటి వరుకు నన్ను క్యూట్ అని అనలేదు’ అని చెప్పుకొస్తుంది సిరి.
ఇక ఇనాయ ఆట తీరుని తెగ మెచ్చుకుంటుంది సిరి..హౌస్ మేట్స్ లో కాస్త ఫైర్ తగ్గింది..ఇంకా కొంచెం బాగా ఆడాలి అని చెప్తుండగా..మరి నాలో ఫైర్ తగ్గిందా అని అడుగుతుంది ఇనాయ..’ఆమ్మో..ఎవరిలో అయినా ఫైర్ తగ్గుతుందేమో కానీ నీలో మాత్రం తగ్గలేదు తల్లి’ అని చెప్తుంది..అప్పుడు ఇనాయ ‘ఈమధ్య కాస్త నాలో ఫైర్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది’ అని సిరి తో అంటుంది..అప్పుడు సిరి ‘లేదు లేదు..వారం వారం నీలో కొత్త రకమైన ఆటని చూస్తున్నాను..చాలా బాగా ఆడుతున్నావు’ అని చెప్పుకొస్తుంది..వీళ్లిద్దరి మధ్య జరుగుతున్నా ఈ సంభాషణ ని చూసి శ్రీహాన్ మొహం మాడిపోతుంది..అలా ఈ ఈరోజు బిగ్ బాస్ హౌస్ సరదా సరదాగా సాగిపోతుంది..ఇక సిరి తర్వాత ఇనాయ సుల్తానా వాళ్ళ అమ్మగారు మరియు కీర్తి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈరోజు హౌస్ లోకి అడుగుపెట్టారు..దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.