Home Entertainment ఇటీవల విడుదలైన ఈ సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇటీవల విడుదలైన ఈ సినిమాల క్లోసింగ్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
210

గత ఏడాది డిసెంబర్ నెల నుండి మొన్న వచ్చిన సర్కారు వారి పాట సినిమా వరుకు వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదలై అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..కరోనా తర్వాత టాలీవుడ్ కి గోల్డెన్ పీరియడ్ మొదలైంది అని అందరూ అనుకున్నారు..మధ్యలో వచ్చిన స్టార్ హీరో సినిమాలు రాధే శ్యామ్ మరియు ఆచార్య ఒక్కటే డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..అయితే స్టార్ హీరోల సినిమాలు అన్ని విడుదలై పోయిన తర్వాత టాలీవుడ్ కి అసలైన గడ్డుకాలం మొదలైంది..మీడియం రేంజ్ హీరోల సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టి డిస్ట్రిబ్యూటర్వ్స్ కి మరియు నిర్మాతలకి ఘోరమైన నష్టాలను మిగిలించాయి..ఒక్క మేజర్ మరియు విక్రమ్ సినిమాలు మినహా తెలుగు లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడం పక్కనపెడితే డిజాస్టర్స్ గా నిలిచాయి..అయితే వీటి క్లోసింగ్ కలెక్షన్స్ ఎంత ఉంటాయో ఒకసారి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూద్దాము.

ముందుగా మనం న్యాచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమా గురించి మాట్లాడుకుందాం..చాలా కాలం తర్వాత నాని నుండి వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది..టాక్ కూడా మంచిగా వచ్చింది..సాధారణంగా నాని సినిమాకి టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు అద్భుతంగా ఉంటాయి..ఎందుకంటే ఫామిలీ ఆడియన్స్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ అలాంటిది..కానీ ఈ సినిమాకి టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టడం లో మొదటి రోజు నుండే విఫలమైంది..30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కేవలం 22 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసి కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది..ఈ సినిమాకి ముందు వచ్చిన తమిళ దుబ్బింగ్ సినిమా విక్రమ్ కి 18 కోట్ల రూపాయిలు షేర్ వచ్చింది..దీని ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 6 కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ లో పెట్టిన పైసలకు మూడింతల లాభాల్ని ఆర్జించింది..ఈ సినిమా తో పాటు విడుదలైన మేజర్ సినిమాకి కేవలం 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా..35 కోట్ల రూపాయిల షేర్ ని సాధించింది..ఇది కూడా సెన్సషనల్ హిట్ గా చెప్పుకోవచ్చు.

ఇక ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన హీరో రామ్ వారియర్ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రూపాయిలు జరగగా..ఫుల్ రన్ లో కేవలం 25 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది..డివైడ్ టాక్ రావడం వల్లే ఈ సినిమాకి కలెక్షన్స్ లేవు..లేకపోతే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేది అని చెప్పొచ్చు..ఈ సినిమా తర్వాత వచ్చిన నాగ చైతన్య థాంక్యూ సినిమా మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి..కనీసం మూడు రోజులు కూడా ఈ సినిమా షేర్స్ ని రాబట్టలేకపోయింది అంటే ఇది ఏ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు..సోమవారం నుండి ఈ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ సినిమాకి ప్రతి చోట డెఫిసిట్స్ పారరంభం అయ్యి..ఇంకా థియేటర్స్ లో ఈ సినిమాని ఉంచితే వచ్చిన మూడు కోట్ల రూపాయిల షేర్ కూడా తగ్గిపోయాయి జీరో షేర్ వచ్చే అవకాశం ఉంది..ఇది పోస్ట్ కరోనా టాలీవుడ్ మీడియం హీరోల పరిస్థితి..టాక్ రాకపోతే కనీసం ఓపెనింగ్ ఇచ్చే పరిస్థితి లో కూడా లేరు మన ఆడియన్స్..దానికి కారణం OTT అనే చెప్పాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…