Home Entertainment ఇందిరా దేవి గారి గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఇందిరా దేవి గారి గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
2
17,735

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియనివాళ్లు ఉండరు. ఎన్నో విభిన్నమైన సినిమాల్లో భిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. హీరోగానే కాదు పద్మాలయా స్టూడియోస్ బ్యానరుపై ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణకు ఇద్దరు భార్యలు. ఆయన మొదటి భార్య ఇందిరాదేవి, రెండో భార్య విజయనిర్మల. విజయ నిర్మల నేపథ్యం గురించి చాలా మందికి తెలుసు. కానీ ఇందిరాదేవి గురించి తెలియని వాళ్లు ఎంతోమంది ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మావయ్య కుమార్తె ఇందిరాదేవి. వరుసగా ఆమె మరదలు అవుతారు. సినిమాల్లో వరుస హిట్లతో జోరు మీద ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల సలహాతో కృష్ణ తన మరదలు ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. 1962లో నవంబర్ 1న వీరి వివాహం జరిగినట్లు సమాచారం. అటు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విజయనిర్మలను 1969లో కృష్ణ ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. రెండో వివాహం చేసుకున్నా ఇందిరాదేవి కూడా కృష్ణతోనే ఉండేవారు. 1979లో ఇందిరాదేవికి ఐదో సంతానం కలిగింది. దీనిని బట్టి చూస్తే వీళ్ల బంధం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు.

అటు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరాదేవిని కృష్ణ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవాళ్లు. అటు పిల్లలకు కూడా ఇందిరాదేవి అంటే ఎంతో ఇష్టం. ఆమె కుమార్తె మంజుల తల్లిపై ప్రేమతోనే తన ప్రొడక్షన్ హౌస్‌కు ఇందిరా ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకుంది. మహేష్‌కు తన తల్లి అంటే ఎంతో సెంటిమెంట్. మాములుగా ఏ భార్య అయినా తను బ్రతికి ఉన్న సమయంలో భర్త మరో పెళ్లి చేసుకుంటే అస్సలు సహించరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నా ఇందిరా దేవి మాత్రం కృష్ణ రెండో పెళ్లిని గౌరవించారు. విజయనిర్మలను ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి చేసుకున్నానని ఇందిరా దేవికి చెప్పగా రెండో పెళ్లి జరిగినా తాను భార్యగానే కొనసాగుతానని భర్తకు చెప్పారు. కృష్ణ నిర్ణయం ఆమెను బాధ పెట్టినా తన భర్తను హర్ట్ చేయడం ఇష్టం లేక ఆమె ఈ విధంగా వ్యవహరించారు. అయితే 2019లో తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయనిర్మల అనారోగ్య కారణాలతో మృతి చెందింది. విజయనిర్మల, కృష్ణ చివరి వరకు కలిసి ఉన్నారు. ప్రస్తుతం కృష్ణ ఆమెతో కలిసి జీవించిన ఇంట్లోనే తన చివరి రోజులు గడుపుతున్నాడు.

అయితే ఇంతలోనే కృష్ణకు మరొక షాక్ తగిలింది. ఈ ఏడాది జనవరి 8వ తేదీ తన పెద్ద కుమారుడు రమేష్ బాబును కోల్పోయాడు. రమేష్ బాబు సైతం కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. తమ్ముడు మహేష్ హీరోగా అర్జున్ అనే సినిమాను కూడా నిర్మించాడు. తనకు సినిమాలు అచ్చిరాకపోవడంతో రమేష్‌బాబు బిజినెస్‌లోనే కొనసాగాడు. రమేష్‌బాబు మరణంతో కృష్ణ, ఇందిరాదేవి ఇద్దరు కూడా పుత్రశోకంతో తల్లడిల్లారు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు తన జీవిత భాగస్వామి, తన ఐదుగురు పిల్లల తల్లి ఇందిరాను సైతం కృష్ణ కోల్పోయాడు. అతి తక్కువ సమయంలో ఇలా తన కుటుంబంలో ముగ్గురిని కోల్పోయిన కృష్ణను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరా దేవికి ఆరోగ్యం మరింత విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ప్రతిరోజు అక్కడ చికిత్స చేయించగా దాదాపు 30 రోజులపాటు హాస్పిటల్లో ఉన్నట్లు తెలిసింది. ఆమెను నాలుగు రోజుల క్రితం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగా అప్పటికే ఆమె పరిస్థితి కష్టంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులతో తెలిపారట. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా నాలుగు రోజులుగా ఆమెకు పూర్తి సమయాన్ని కేటాయించారట. పైగా ఆమెకు ధైర్యం కల్పించే విధంగా తోడుగా ఉన్నారట. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె బుధవారం తుదిశ్వాస విడిచారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…