
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి వైభవం లాంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న తన తుది శ్వాసని విడిచి స్వర్గస్తులు అవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినా కృష్ణ గారు వ్యక్తిత్వం లో కూడా మేలిమి బంగారం లాంటి మనిషి..ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో కృష్ణ గారి ఒక్క మచ్చ కూడా లేదు..అంత స్వచ్ఛమైన మనుసున్న కృష్ణ గారికి రెండు పెళ్లిళ్లు ఎందుకు అయ్యాయి అనే సందేహం అభిమానులతో ప్రేక్షకుల్లో కూడా మెలగడం వాస్తవమే..కానీ ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవ్వరం చెప్పలేం..అలాగే కృష్ణ మరియు విజయ నిర్మల గారి మధ్య కూడా పుట్టింది..కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ లోకి 1965 వ సంవత్సరం లో తేనెమనసులు అనే సినిమా ద్వారా అడుగుపెట్టాడు..ఈ సినిమాకి ముందే ఆయన తన మేనమామ కూతురైన ఇందిరా దేవి గారిని పెళ్లాడారు.
ఇందిరా దేవి గారికి కృష్ణ గారు మరియు కుటుంబమే తన లోకం..సినిమా ఇండస్ట్రీ కి ఆమె సంపూర్ణంగా దూరంగా ఉంటూ వచ్చేది..ఆ వ్యవహారాల్లో కూడా ఆమె తలదూర్చే వారు కాదు..అలా కృష్ణ గారి దాంపత్య జీవితం కొనసాగుతున్న సమయం లో బాపు గారి దర్శకత్వం లో కృష్ణ మరియు విజయ నిర్మల హీరోహీరోయిన్లు గా సాక్షి అనే సినిమా వచ్చింది..ఈ సినిమా అప్పుడే వీళ్లిద్దరి మధ్య మంచి సన్నిహిత్య సంబంధం ఏర్పడింది..ఇద్దరు మంచి స్నేహితులయ్యారు..అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి..స్నేహం కాస్త వీళ్లిద్దరి మధ్య ప్రేమగా మారి ఎవరికీ తెలియకుండా ఒక గుడి లో 1969 వ సంవత్సరం లో పెళ్లి చేసుకున్నారు..అప్పట్లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ గా నిలిచింది..ఆ తర్వాత కృష్ణ గారు నేరుగా ఇంట్లోని కుటుంబ సభ్యులతో పాటు ఇందిరా దేవి గారికి కూడా తానూ విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపాడు.
ఇందిరా దేవి గారు ఈ విషయం తెలిసిన వెంటనే కాస్త బాధకి గురైనప్పటికీ కృష్ణ గారిని అర్థం చేసుకున్నారు..మీకు రెండవ పెళ్ళైన తర్వాత కూడా నేను మీ భార్య గానే కొనసాగుతాను..నన్ను దూరం చెయ్యకండి అని ఇందిరా దేవి గారు అనడం తో కృష్ణ గారి కంట నుండి నీళ్లు వచ్చాయట..ఆమె కోరిక మేరకే కృష్ణ గారు ఇందిరా దేవి మరియు విజయ నిర్మల గార్లతో దాంపత్య జీవితం కొనసాగించారు..ఇందిరా దేవి గారి ఉదారమైన స్వభావం కి కృష్ణ గారు గౌరవిస్తూ విజయ నిర్మల గారితో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదు..ఆమెతో సంతానం పొందకూడదని కృష్ణ గారు బలంగా నిశ్చయించుకున్నారు..విజయ నిర్మల గారు కూడా కృష్ణ గారి అభిప్రాయం కి కట్టుబడి కేవలం అతనికి జీవితాంతం తోడుగా ఉండేందుకే తన జీవితాన్ని అర్పించింది..అలా ఒకరికోసం ఒకరు చివరి దాకా ప్రయాణం కొనసాగించారు ఈ దంపతులు ముగ్గురు కూడా..ఇలా ప్రపంచం లో ఎవ్వరు చెయ్యలేదు ఒక్క కృష్ణ గారు తప్ప.