
మెగాస్టార్ , ఈ పేరు చెప్తే చిన్నపిల్లవాడు సైతం ఉత్సాహం తో ఉంటాడు. అంతటి పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గత కొని దశాబ్దాలుగా no 1 స్థానం లో ఉన్నారు చిరంజీవి. ఎటువంటి అండ లేకుండా స్వయంకృషిని నమ్ముకుని సొంతంగా కస్టపడి ఇండస్ట్రీ లో మెగా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి. ఇప్పటికి కూడా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ రికార్డు కొడుతున్నారు చిరంజీవి..రీసెంట్ గా వచ్చిన మూవీ “గాడ్ ఫాదర్” సినిమా తో సూపర్ కామ్ బ్యాక్ ఇచ్చారు చిరంజీవి. తన తదుపరి చిత్రాలు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు రెడీ అవుతున్నాయి . ఐతే ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా రీసెంట్ గా “శూన్యం నుంచి శిఖరాగ్రాలకు” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి . ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన కొన్ని కొమ్మెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ – ” నా అభిమానాలు అందరు నను మెగాస్టార్ అని పిలుస్తారు, ఆ పేరు కోసం నేను ఒకడినే ఎంత కష్టపడనో నాకు తెలుసు. నా వల్ల ఇండస్ట్రీ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చారు. కానీ నాకు వాళ్ళని చూస్తే కుళ్ళుగా ఉంటుంది. ఒకోసారి కడుపు మండిపోతుంది అని అన్నారు. నా ఇంట్లో నా సినిమాలు ఎవరు చూడటం లేదు, నా సినిమాని నేనే ప్రమోట్ చేసుకునే స్థాయికి దిగజారిపోయాను అని అన్నారు. నా మనవళ్లు , మానవరాలతో నా సినిమా గాడ్ ఫాదర్ సీక్రెట్ గ ఇంట్లో ఎవరు లేని టైం చూపించాను అని అన్నారు. నా గొప్పలు నేనే చెప్పుకోవాల్సి వస్తుంది.”
రామ్ చరణ్ , అల్లు అర్జున్ కి మంచి పేరు రావడం తో నా పేరు ఎవరికి గుర్తు ఉండటం లేదు అని అన్నారు. ప్రస్తుత తరం పిల్లలు నా గురించి అసలు చెప్పుకోవడం లేదు అని అన్నారు. ఇలా ఉండటం వలన నాకు వాళ మీద కోపం వస్తుంది అని చిరంజీవి అన్నారు . చిరంజీవి అన్న ఈ మాటలు సరదాకే ఉన్నపటికీ తన మనసులో ఉన్న బాధను మెగా ఫాన్స్ అర్ధం చేసుకున్నారు. మెగా ఫాన్స్ మాటికీ చిరంజీవికి వారసుడు రామ్ చరణ్ అని గెట్టి గ చెప్తున్నారు. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ గా ఫేమస్ అయ్యాడు.