
అఖండ సినిమా 100 కోట్ల వైపు అడుగులు వేస్తుంది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న తీరు చూసి అంట ఆశ్చర్యపోతున్నారు. ట్రేడ్ వర్గాలు సైతం షాక్ చేసేలా అఖండ ప్రభంజనం సృష్టించింది, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పని అయిపోయింది అనుకున్న వాళ్ళకి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇస్తున్నారు. అఖండ సినిమా 6 రోజులోనే 85 కోట్లకి పైగా గ్రాస్ వాసులు చేసింది. విడుదలైన 6వ రోజు కూడా 3 కోట్ల వరకు షేర్ వాసులు చేసి షాక్ అయేలా చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వం లో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చుసిన తరువాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు, బాలకృష్ణ జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్స్ ఆఫీస్ దెగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతర చూపించారు.
తొలి ఆరు రోజులు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడటమే కాకుండా చాలా చోట్ల రికార్డ్స్ కూడా సృష్టించారు చాలా రోజులు తరువాత ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాలు తరువాత బాల్లయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చారు, రులెర్, ఎన్టీఆర్, మహానాయకుడు లాంటి సినిమాలు క్లోసింగ్ కలెక్షన్స్ లో కూడా కనీసం పది కోట్లు షేర్ తీసుకురాలేదు కానీ ఇపుడు అఖండ మాత్రం అద్భుతంగా చేసింది. ఈ సినిమా ఆరు రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 51.82 కోట్లకి పైగా షేర్ వాసులు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 43 కోట్ల వరకు షేర్ వాసులు చేసింది ఈ సినిమా ఈ జాతర చుసిన తరువాత అంట ఆశ్చర్యపోతున్నారు. బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గిపోయింది అని కామెంట్స్ చేసిన వాళ్లకు అఖండ సినిమా తో దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు బాల్లయ్య, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
నైజం లో 14.87 కోట్ల, సీడెడ్ లో 11. 73 కోట్లు, ఉత్తరాంధ్ర లో 4.56 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 3 కోటు, వెస్ట్ గోదావరి లో 2.43 కోట్లు, గుంటూరు లో 3.73 కోట్లు, కృష్ణ లో 2.73 కోట్లు, నెల్లూరు లో 1.98 కోట్లు, ఆంధ్ర, తెలంగాణ మొత్తం 46 కోట్ల, కర్ణాటక మొత్తం 3 కోట్లు, ఓవర్సీస్ 4 కోట్ల మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 53.53 కోట్లు ఈ సినిమా కి 53 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసింది, ఆరు రోజులోనే 52 కోట్లు షేర్ వాసులు చేసింది ఈ చిత్రం. ఆరవ రోజు కూడా తెలంగాణ, ఆంధ్ర లో 253 కోట్లకి పైగా వాసులు చేసింది అలాగే ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లకి పైగానే తీసుకొచ్చింది మరో రెండు కోట్లు వాసులు చేసే సినిమా సేఫ్ జోన్ కి వస్తుంది, ఇప్పటిదాకా ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి దీనితో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వీక్ డేస్ లో కూడా ఇదే చేస్తే బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనే తెలుస్తుంది.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరి కొత్త రికార్డు సృష్టించింది ముందు నుంచి బాల్లయ్య అభిమానులకు అంచనాలు బాగానే ఉన్నాయ్. మొదటి రోజే అనుకున్నట్లు గా బారి స్థాయిలో లో ఈ సినిమా ఓపెనింగ్స్ అందుకున్నాయి. బాలకృష్ణ కెరీర్ మొత్తం లో అత్యధిక స్థాయిలో వాసులు అందుకుంది. బాలకృష్ణ గతం లో ఎన్నడూ లేని విధంగా అఘోరా పాత్రలో ప్రేక్షకులను అక్కటుకున్నాడు. ఇక బోయపాటి శ్రీను లెజెండ్ సినిమా తరువాత సరైన సక్సెస్ చూడలేదు అందుకే అఖండ తో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద హాట్ కావాలని చాలా కష్టపడ్డారు. ఈ సినిమా కోసం అయినా రెమ్యూనిరేషన్ కూడా త్యాగం చేసాడు. ఈ సినిమా సక్సెస్ అయితేనే లాభాలో వాటా వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు మొత్తానికి అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్ లో పెద్ద హిట్ కొట్టి అత్యధికంగా బారి స్థాయిలో వాసులు చేసుకుంది.