Home Entertainment ఇంటర్ పరీక్షల ప్రశ్న పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశ్నలు..మాములు క్రేజ్ లేదుగా

ఇంటర్ పరీక్షల ప్రశ్న పాత్రలలో జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశ్నలు..మాములు క్రేజ్ లేదుగా

2 second read
0
0
3,219

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి భాషలోనూ సెన్సషనల్ హిట్ అయ్యి అటు రామ్ చరణ్ ఇటు ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది..సుమారు 1100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ సెన్సేషన్ సృష్టించి 50 రోజులు పూర్తి చేసుకుంది..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఈ నెల 20 వ తారీకునుండి జీ 5 యాప్ లో అందుబాటులోకి రాబోతుంది..పే ఫర్ వ్యూ పద్దతి లో ఈ సినిమా మనకి ఈ యాప్ లో అందుబాటులోకి రానుంది..ఇవన్నీ పక్కన పెడితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పోషించిన కొమురం భీం మరియు అల్లూరి సీత రామ రాజు పాత్రలకు ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది ఇటీవల జరిగిన ఒక్క సంఘటన.

ఇక అసలు విషయానికి వస్తే ఇటీవలే ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పరీక్షలలో ఇంగ్లీష్ ప్రశ్న పత్రాలలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్రపై ప్రశ్నలు వచ్చాయి..#RRR గ్రాండ్ సక్సెస్ అయ్యినందుకు ఈ చిత్రం లో కొమురం భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్ తో మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది,ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనే దాని పై ఇంగ్లీష్ లో వ్యాసం రాయండి అంటూ ఒక్క ప్రశ్న వచ్చిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది..ఆ ప్రశ్న ని మీరు క్రింద ఉన్న ఫొటోలో చూడవచ్చు..ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీం పాత్ర ఎంత ఎమోషనల్ గా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా కొమురం భీముడొ అంటూ వచ్చే పాట ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించేలా చేసింది..ముఖ్యం గా ఈ పాటలో ఎన్టీఆర్ చూపించిన హావభావాలు ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీ లో ఎవ్వరు లేరు అని అనిపించేలా చేసింది..సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి రామ్ చరణ్ పాత్ర కి ఉన్నంత స్కోప్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఈ చిన్న పాట తో ఎన్టీఆర్ ఇండియన్ ప్రేక్షకుల మీద చూపించిన ప్రభావం మామూలుది కాదు అనే చెప్పాలి.

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది..ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..KGF సిరీస్ తో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సాలార్ అనే సినిమా చేస్తున్నాడు..35 శాతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ముగియగానే ఎన్టీఆర్ తో చెయ్యబొయ్యే సినిమా కి షిఫ్ట్ అవుతాడు ప్రశాంత్ నీల్..ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమాలు చెయ్యడానికి బాలీవుడ్ బడా నిర్మాతలు మరియు దర్శకులు కూడా క్యూ కడుతున్నారు..కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ ముందుకి పోతున్నాడు..కొరటాల శివ తో ఆయన చెయ్యబొయ్యే సినిమా కూడా ఎంతో మాస్ గా ఉండబోతుంది అట..కొరటాల శివ మొట్టమొదటి సారి సందేశాత్మక స్టోరీ ని పక్కన పెట్టి ఒక్క ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ ని ఎన్టీఆర్ కోసం డిసైన్ చేసాడు అట..మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ బయటకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…