
టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగపతిబాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి. సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ వారసుడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 100 సినిమాలకు పైగానే నటించాడు. శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల కథలకు జగపతిబాబు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. అందుకే అతడు హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువగా ఇద్దరు కంటే ఎక్కవ హీరోయిన్‌లు ఉండేవాళ్లు. ఆయనకు ఇద్దరు, అల్లరి ప్రేమికుడు, చిలకపచ్చ కాపురం, శుభమస్తు, శుభాకాంక్షలు, మూడు ముక్కలాట వంటి సినిమాలు జగపతిబాబును రొమాంటిక్ హీరోగా నిలబెట్టాయి. కెరీర్ ప్రారంభంలో గొంతు బాలేదని, డబ్బింగ్ కూడా చెప్పుకోలేడు అని జగపతిబాబును హేళన చేసేవాళ్లు.కానీ ఇప్పుడు అదే వాయిస్‌తో డైలాగులు చెప్తుంటే అబ్బో అనుకుంటున్నారు.
అయితే సినీ ఇండస్ట్రీలో మిగతా హీరోల తరహాలో జగపతిబాబు కూడా ప్రేమ వ్యవహారాలు బాగానే నడిపాడు. సౌందర్యతో క్లోజ్‌గా ఉండే హీరో అని వార్తలు రావడంతో పాటు మరో హీరోయిన్‌తో లవ్ అఫైర్ నడిపాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సదరు హీరోయిన్ ఇప్పుడు ప్రముఖ సీరియల్‌లో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆమెకు జగపతిబాబు పలు సినీ అవకాశాలతో పాటు లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులు కూడా ఇచ్చాడంటూ పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు జగపతిబాబుకు సినిమా అవకాశాలు లేని సమయంలో ఆ సీరియల్ హీరోయిన్ అండగా నిలిచిందని.. దాంతో వీరిద్దరి ప్రేమ బంధం కొంతకాలం పాటు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు రావడంతో వీరి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్ పడిందని రూమర్లు వస్తున్నాయి. ఆమె సీరియల్ నటి కస్తూరి అని తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు జగపతిబాబు కంపల్సరీ అయిపోయాడు. దాదాపు ప్రతి సినిమాలోనూ జగపతిబాబు ఉంటున్నాడు. హీరోగా రాణించకపోవడంతో బాలయ్య నటించిన లెజెండ్ సినిమాతో విలన్‌గా మారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అటు విలన్‌గా, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు నచ్చిన పాత్రలను జగపతిబాబు పోషిస్తుండటంతో సినిమాల్లో బిజీగా అయిపోయాడు. అయితే గతంలో జగపతిబాబుకు నటన రాదు.. ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమే అన్నారు.. కానీ ఆ నటన రాదన్న అతడే ఏకంగా 7 నంది అవార్డులు అందుకున్నాడు. 90ల్లో జగపతిబాబు నటించిన కుటుంబ కథా చిత్రాలు సంచలన విజయం సాధించాయి. శుభలగ్నం, మావిచిగురు, పెళ్లిపీటలు వంటి సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అలాగే గాయం, మనోహరం, అంత:పురం లాంటి సినిమాలతో జగపతిబాబు నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.