
సోషల్ మీడియా ని గత రెండు రోజులుగా ఊపేస్తున్న వార్త నిహారిక కొణిదెల మరియు చైతన్య విడాకులు తీసుకున్న వ్యవహారం.2020 వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఘనంగా అంగరంగ వైభవంగా నాగ బాబు మరియు మెగా కుటుంబ సభ్యులు జరిపించారో మన అందరం చూసాము.మెగా ఫ్యామిలీ ని ఇంత ఆనందంగా చూసి చాలా కాలం అయ్యింది అంటూ అభిమానులు మురిసిపోయారు.పెళ్ళైన తర్వాత నాగబాబు కట్నం క్రింద ఒక ఇల్లు, బోలెడంత బంగారం కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి.అంత ఘనంగా ఈ పెళ్లి జరిపిస్తే నేడు వీళ్లిద్దరు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలు మెగా అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది.ఇప్పటికే వీళ్లిద్దరు ఇంస్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో అయిపోయారు.ఇద్దరు అకౌంట్స్ లో కూడా వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు మరియు పెళ్లి ఫోటోలను డిలీట్ చేసేసారు.ఇదంతా చూస్తున్న మెగా ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం.
అయితే వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.అసలు విషయానికి వస్తే గత ఏడాది నిహారిక వీకెండ్ పార్టీస్ లో భాగంగా ఒక పబ్బు కి వచ్చింది.అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు అంటూ వార్తలు రావడం తో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సోదాలు నిర్వహించారు.ఆ పబ్ లో నిహారిక కూడా ఉండడం తో ఆమెని కూడా పక్క రోజు పోలీసులు స్టేషన్ కి పిలిచి విచారించారు.అయితే వాళ్ళ విచారణ లో నిహారిక ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని తేలింది.అప్పట్లో ఈ వార్త కలకలం రేపింది.రాజకీయ నాయకులూ కూడా పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు లపై విమర్శలు చేసారు.అయితే ఇంత రచ్చ జరిగిన తర్వాత ఇంకెప్పుడు పబ్బులకు వెళ్లకూడదని నిహారిక కి ఇంట్లో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట.ఆమె కూడా పెద్ద వాళ్ళ మాటలకు గౌరవించి పబ్బులకు వెళ్లడం మానేసింది.
అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రతీ విషయం లోను నిహారిక కి ఆంక్షలు పెట్టడం ప్రారంభించారట.తన స్వేచ్ఛ ని పూర్తిగా కోల్పోయినట్టు ఫీల్ అయినా నిహారిక ఇంట్లో వాళ్ళతో గొడవలు పడడం ప్రారంభించింది.అప్పటి నుండే చైతన్య కి మరియు నిహారిక కి మధ్య మనస్పర్థలు రావడం మొదలైంది.చివరికి అది విడాకులు వరకు దారి తీసిందని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.మరి రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై అటు నాగ బాబు కానీ, ఇటు నిహారిక కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.చిన్న రూమర్ వచ్చిన వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చే నాగబాబు ఈ విషయం లో మౌనం పాటించడం చూస్తుంటే విడాకులు నిజమే అని అంటున్నారు విశ్లేషకులు.