Home Entertainment ఆస్తుల విషయం లో నరేష్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ

ఆస్తుల విషయం లో నరేష్ కి కోలుకోలేని షాక్ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ

0 second read
0
0
29,201

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు గారి తర్వాత అంతటి క్రేజ్ ని సంపాదించి నెంబర్ 1 మాస్ హీరో గా దశాబ్దాలు కొనసాగిన హీరో సూపర్ స్టార్ కృష్ణ..ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ కి ఆయన మొట్టమొదటి ఊర మాస్ హీరో..సాంకేతికంగా, రికార్డ్స్ పరంగా టాలీవుడ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన మహానటుడు ఆయన..కృష్ణ గారు చేసినన్ని సాహసాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ హీరో కూడా చెయ్యలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..అలా ఇండస్ట్రీ లో తన చరిత్రని సువర్ణకాశరాలతో లిఖించిన సూపర్ స్టార్ కృష్ణ గారు మొన్న ఉదయం స్వర్గస్తులవ్వడం కోట్లాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసింది..టాలీవుడ్ కి ఎంత మంది మాస్ హీరోలైన రావొచ్చు కానీ..కృష్ణ లాంటి మాస్ హీరో మళ్ళీ పుట్టదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఆ స్థాయి కల్ట్ మాస్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరో ఆయన.

హీరో గా నిర్మాతగా కృష్ణ సాధించినన్ని విజయాలకు తగట్టుగా ఆయన డబ్బులను సంపాదించలేకపోయారని ఇండస్ట్రీ లో అందరూ చెప్పుకునే మాట..సినిమాలు ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులివ్వడం..ఫ్రీ గా సినిమాలు చేసిపెట్టడం వంటివి ఆరోజుల్లో చాలా చేసాడు..కొన్ని కొన్ని సందర్భాలలో సూపర్ హిట్ అయ్యి బాగా లాభాలు వచ్చినప్పటికీ కూడా కృష్ణ గారు డబ్బులు ఎగ్గొట్టేవారట..కృష్ణ గారు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదట..వాళ్ళకెన్ని కష్టాలు ఉన్నాయో పోనివండి ఉన్నప్పుడు వాళ్ళే ఇస్తారులే అని కృష్ణ గారు చాలా తేలికగా వదిలేసావారట అప్పట్లో..అంత మంచి మనసు ఉన్న మహోన్నత వ్యక్తి కృష్ణ గారు..అందుకే ఆయన నిర్మాతల పాలిట దేవుడయ్యాడు..అయితే కృష్ణ గారు తన సినీ ప్రయాణం లో సంపాదించుకున్న ఆస్తులు 400 కోట్ల రూపాయలట..ఆయన రేంజ్ కి ఇది చాలా తక్కువే..కానీ ఆస్తులన్నీ తన కొడుకు కూతుర్లకు పుట్టిన పిల్లలకు వీలునామా రాసిచ్చేసాడట కృష్ణ గారు..తన బాగోగులు చూసుకుంటున్న నరేష్ కి మాత్రం ఒక్క రూపాయి ఆస్తి కూడా ఇవ్వలేదట.

ఎందుకంటే నరేష్ కృష్ణ కి కొడుకు కాదు కాబట్టి..విజయ నిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొడుకు నరేష్ ని స్వీకరించి తన కుటుంబం లోకి చేరదీసాడు కానీ..ఆస్తుల పంపకం విషయం లో మాత్రం కృష్ణ గారు నరేష్ కి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదట..కానీ విజయ నిర్మల గారు తన పేరు మీదున్న ఆస్తులన్నీ నరేష్ కి చెందుతున్నట్టు వీలునామా రాసిందట..వాటి విలువ కూడా వందల కోట్లలోనే ఉంటుందని తెలుస్తుంది..అయితే నరేష్ ని మాత్రం తన సొంత కొడుకులకు ఎలాంటి మర్యాద ఇచేవాడో అలాంటి మర్యాదనే ఇచ్చేవారట కృష్ణ గారు..నరేష్ నటుడిగా ఎంత డిమాండ్ ఉన్నవాడో మన అందరికి తెలిసిందే..ఆయన హీరో గా ఎంత సక్సెస్ అయ్యాడో..క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా అంతకు మించి సక్సెస్ అయ్యాడు..విజయ నిర్మల గారు చనిపోయిన తర్వాత ఆమె స్థానం లో కృష్ణ గారి బాగోగులు చూసుకుంటూ వస్తున్నాడు నరేష్..కృష్ణ గారి అంత్యక్రియ కార్యక్రమాలు కూడా అన్ని దగ్గరుండి చూసుకున్నాడు నరేష్.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…