Home Entertainment ఆస్కార్ అవార్డ్స్ లో #RRR మూవీ ప్రభంజనం

ఆస్కార్ అవార్డ్స్ లో #RRR మూవీ ప్రభంజనం

0 second read
0
1
25,718

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయి మూవీగా నిలిచిపోయింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ తమ నట విశ్వరూపాన్ని చూపించారు. కేవ‌లం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ సినిమా స‌త్తా చాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు జక్క‌న్న పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఉండ‌గా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ వ‌రల్డ్ ద‌ర్శ‌కుడిగా మారిపోయారు. ఈ సినిమాను ఇంగ్లీష్‌లో చూసిన విదేశీయులు ట్విట్ట‌ర్‌లో జ‌క్క‌న్న మేకింగ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఆర్.ఆర్.ఆర్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఇటీవల ఓటీటీలోనూ ఆర్.ఆర్.ఆర్ తన సత్తాను నిరూపించింది. వెండితెరపై వసూళ్ల సునామీని సృష్టించిన ఈ మూవీ రెండు ఓటీటీలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు,తమిళం, కన్నడం, మలయాళం భాషలకు సంబంధించి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాగా హిందీ భాషకు సంబంధించిన వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఈ మూవీకి అనూహ్య స్పందన రావడంతో ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 95 అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాను నామినేట్ చేయాలని భారతీయ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. నామినేషన్స్‌తో పాటు ఆస్కార్ కూడా గెలుచుకునే అర్హత ఈ సినిమాకు ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చిలో లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆస్కార్‌కు నామినేట్ అవుతుందో వేచి చూడాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విడుదలైన అన్ని భాషల్లో ఘనవిజయం సాధించిన ఆర్.ఆర్.ఆర్ మూవీని మరికొన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ చిత్రాన్ని కొరియన్ భాషలోనూ రిలీజ్ చేసింది. అయితే అక్కడ ఇది థియేటర్లలో సందడి చేయడం లేదు. నెట్‌ఫ్లిక్స్ సంస్థే దక్షిణ కొరియాలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ను మొదలు పెట్టింది. ఇందులో కొరియన్ సబ్‌టైటిల్స్ వచ్చేలా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా ఆర్.ఆర్.ఆర్ మూవీ బాలీవుడ్‌లోనూ రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరో రామ్‌చరణ్ ఎంట్రీ సీన్ కోసం యూనిట్ సభ్యులు చాలా కష్టపడినట్లు వార్తలు వచ్చాయి. చెర్రీ ఇంట్రడక్షన్ సీన్‌ను 32 రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. అటు ఈ సన్నివేశానికి చేసిన వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన వీడియో సైతం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ మూవీలో ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…