Home Entertainment ఆస్కార్ అవార్డు రేస్ లో జూనియర్ ఎన్టీఆర్..నందమూరి అభిమానులు మీసం మెలేసే వార్త!

ఆస్కార్ అవార్డు రేస్ లో జూనియర్ ఎన్టీఆర్..నందమూరి అభిమానులు మీసం మెలేసే వార్త!

2 second read
0
0
367

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన దర్శక ధీరుడు రాజమౌళి #RRR చిత్రం ఎంత పెద్ద సంచలనమైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..విడుదలైన అన్ని బాషలలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి..ఇందులో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి..థియేటర్స్ లో సుమారు 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం..OTT లో విడుదలైన తర్వాత సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది..ఈ సినిమా హిందీ వర్షన్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఏ ముహూర్తాన వీళ్ళు ఈ సినిమాని అప్లోడ్ చేసారో తెలీదు కానీ..#RRR సినిమా రీచ్ కందంతరాలు దాటిపోయి ప్రతి ఒక్కరు రాజమౌళి ని మరియు ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల నటనని సోషల్ మీడియా వేదికగా ప్రశంసలతో ముంచి ఎత్తేసారు..ఇండియా లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా.

పశ్చిమ దేశానికీ సంబంధించిన ప్రేక్షకులు అయితే ఈ సినిమాని నెత్తిన పెట్టేసుకున్నారు అనే చెప్పాలి..హాలీవుడ్ లో బిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలకు స్టోరీలు రాసిన రైటర్స్ మరియు దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు..దీనితో ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన రీచ్ ని చూసి కచ్చితంగా ఆస్కార్ అవార్డ్స్ కి వెళ్తుందని అందరూ అంచనా వేశారు..అనుకున్నట్టే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ లోకి వెళ్ళింది..ఈ సినిమా లో ఒక హీరో గా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ని హాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆస్కార్ అవార్డ్స్ ప్రిడిక్షన్స్ లో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని నామినేట్ చేసారు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా ‘కొమురం భీముడొ’ పాటలో ఎన్టీఆర్ నటన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడిని కదిలించింది.

డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ పాటలో ఎన్టీఆర్ నటించిన విధంగా ఇండియా లో ఏ నటుడు కూడా నటించలేదంటూ సినిమా విడుదల తర్వాత ఒక పెద్ద స్టేటుమెంట్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..వాస్తవానికి ఈ సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్..ఎన్టీఆర్ ని ఒక సపోర్టింగ్ యాక్టర్ గా చూపించాడు రాజమౌళి..ఎన్టీఆర్ పాత్ర కి ఉన్న స్కోప్ కూడా చాలా తక్కువే..కానీ ఉన్నంత లో ఎన్టీఆర్ చూపించిన నటన అమోఘం అనే చెప్పాలి..ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ పాత్రకంటే ఎన్టీఆర్ పాత్రనే ఎక్కువ నచ్చింది..అలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కాబట్టే ఈరోజు ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవుతాడని ఒక పాపులర్ మ్యాగజైన్ ప్రకటించింది అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు..మరి ఆ మ్యాగజైన్ అంచనా వేసినట్టే ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్స్ ని నామినేట్ అవుతాడా లేదా అనేది చూడాలి..ప్రస్తుతానికి అయితే ఈ వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…