Home Entertainment ఆస్కార్స్ నామినేషన్స్ లో #RRR ‘నాటు నాటు’ సాంగ్..ఇందుకోసం మూవీ టీం ఎన్ని మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందో తెలుసా?

ఆస్కార్స్ నామినేషన్స్ లో #RRR ‘నాటు నాటు’ సాంగ్..ఇందుకోసం మూవీ టీం ఎన్ని మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందో తెలుసా?

2 second read
0
0
153

యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ – 2023 జాబితా వచ్చేసింది. 95వ అస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను అకాడమీ తాజాగా ప్రకటించింది. భారతీయుల ఆశలను సజీవంగా నిలుపుతూ, మన తెలుగు పాట సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల ముంగిట నిలిచింది. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రలోని “నాటు నాటు” పాటను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ కాబడి చరిత్ర సృష్టించింది..#RRR మూవీ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత.. ‘నాటు నాటు’ పాట కచ్ఛితంగా ఆస్కార్ సాదిస్తుందని అనేక మంది హాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మన పాట అకాడమీ అవార్డ్ కు నామినేట్ అవ్వాలని ప్రతి ఒక్క భారతీయుడూ కోరుకున్నాడు. అందరి అంచనాలను నిజం చేస్తూ నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచింది.

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన “ఆర్ ఆర్ ఆర్” సినిమా వరల్డ్ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డీవీవీ దానయ్య నిర్మాణంలో మ్యూజిక్ డైరక్టర్ ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా ఇందులోని ‘నాటు నాటు’ పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ అయింది. గీత రచయిత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ కలిసి హుషారుగా ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఫ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల నుంచి దాదాపు మూడు వందల చిత్రాలు ఆస్కార్ కోసం షార్ట్ లిస్ట్ అవ్వగా.. అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలతో వివిధ విభాగాల్లో తుది జాబితాను ఈరోజు ప్రకటించారు. కాలిఫోర్నియా వేదికగా రిజ్ అహ్మద్ మరియు అల్లిసన్ విలియమ్స్ హోస్ట్ లుగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగానే ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట నామినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ సినిమాకు నామినేషన్ దక్కినట్లైంది. గతంలో హిందీ చిత్రం ‘లగాన్’ ఆస్కార్ తుది జాబితాలో నిలిచినా, అవార్డు మాత్రం దక్కలేదు. అయితే ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి వర్క్ చేసిన ఏ.ఆర్. రెహమాన్ మరియు రసూల్ పూకుట్టిలను అకాడమీ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు RRR చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు అవార్డ్ వరిస్తే, ఈ ఘనత సాధించిన ఏకైన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టిస్తుంది.

‘నాటు నాటు’ పాటతో పాటు ఇండియా నుంచి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పర్స్’.. డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో ‘ఆల్ ది బ్రీత్స్’ సినిమాలు కూడా నామినేషన్స్ లో నిలిచాయి. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక మార్చి 12న హాలీవుడ్‌ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరగనుంది. మన దేశానికి ఈసారైనా ఆస్కార్ అవార్డ్ మనకి వస్తుందా రాదా తెలియాలంటే అప్పటి వరకూ వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటికే ఆస్కార్ నామినేషన్లు రివ్యూ కోసం RRR టీమ్ చాలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…