
టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువ అవుతుంది..బాహుబలి సిరీస్ తో ఆయన ఎవ్వరికి అందనంత రేంజ్ కి ఎదిగిపోయాడు..పాన్ ఇండియా లెవెల్ లో తన స్టార్ స్టేటస్ తో సూపర్ స్టార్ రజిని కాంత్, సల్మాన్ ఖాన్ అమిర్ ఖాన్ వంటి లెజెండ్స్ ని కూడా దాటేశాడు..నేడు ప్రభాస్ సినిమా హిట్ అయ్యింది అంటే వందల కోట్లు వస్తాయి అనేది నిన్న మొన్నటి మాట..ఇప్పుడు ఆయన సినిమా హిట్ అయితే వేల కోట్ల రూపాయిలే వస్తాయి..ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమా సాహూ కూడా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే, పొరపాటున ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చి ఉంటె ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు.
ఆ స్థాయి స్టార్ స్టేటస్ లో ఉన్నాడు ప్రభాస్..ఇక ఇటీవలే డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినా రాధే శ్యామ్ సినిమా కూడా 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది అంటే మాములు విషయం కాదు..అది ఎవరికీ సాధ్యం కాదు కూడా..ప్రస్తుతం ప్రభాస్ మూడు పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు..సలార్ మరియు ఆదిపురుష్ షూటింగ్స్ జరుగుతున్నా సమయం లో మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ K అనే సినిమాని మొదలెట్టాడు..ఈ చిత్రం షూటింగ్ కూడా శెరవేగంగా సాగుతుంది.
ఇక ప్రాజెక్ట్ K సినిమా గురించి ఆ చిత్ర నిర్మాత సి.అశ్వినీదత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు..ఈ సినిమా మర్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉండే సూపర్ హీరోల తరహా సినిమాగా ఉండబోతుంది అట..కేవలం నేషనల్ వైడ్ గా కాదు..ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారట..బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఎలాగో ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ క్రేజ్ ని పూర్తిగా వాడుకోబోతున్నారట మేకర్స్..ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఒళ్ళు హూనం చేసుకునే విధంగా కష్టపడుతున్నాడట..ఇటీవలే ఒక భారీ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ప్రభాస్ కాళ్ళు బాగా దెబ్బతిన్నాయట.
ప్రస్తుతం ఆయన కాళ్ళు సర్జరీ చేయించుకునేందుకు విదేశాలకు వెళ్లినట్టు చెప్పుకొచ్చారు అశ్వినిదత్..ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనె నటిస్తుండగా..అమితాబ్ బచ్చన్ గారు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు..సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్..ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతుంది..మరి ఈ సినిమా తో ప్రభాస్ బాహుబలి రేంజ్ లో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.