
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌దేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజేత సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు మంచి నటుడు అని పేరు తెచ్చుకున్నాడు. అయితే తర్వాత అతడు నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో సక్సెస్ రుచి చూడలేకపోయాడు. ఇంతలో శ్రీజతో విడిపోయాడనే వార్తల కారణంగా కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు. కళ్యాణ్‌దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్లాయో అన్న సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే శ్రీజతో విడాకుల రూమర్లు కళ్యాణ్ దేవ్‌ను మరింతగా ఫేమస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఇంతకీ కళ్యాణ్‌దేవ్ పోస్టులో ఏముందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గడిచిపోయిన ఏడాది 2022లో చాలా నేర్చుకున్నానని, సహనంగా ఎలా ఉండాలో తనకు తెలిసొచ్చిందని, ఎదగడం అంటే ఏంటో అర్థమయ్యిందని, అవకాశాల్ని అందుకోవడం, రిస్క్ తీసుకోవడం గురించి కూడా తెలుసుకున్నానని కళ్యాణ్‌దేవ్ తన పోస్టులో వివరించాడు. మొత్తానికి 2022 ఏడాది తనకు చాలా నేర్పిందని కళ్యాణ్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. ఇతరుల తప్పులను కూడా క్షమించడం అలవాటు చేసుకున్నానని తన పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో శ్రీజ గురించే ఈ పోస్ట్ పెట్టాడని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. తనతో తాను ఎక్కువగా గడపడం కూడా నేర్చుకున్నానని.. ఈ ప్రయాణంలో తనను తాను మార్చుకునేలా సాయపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే శ్రీజ గురించి కళ్యాణ్‌దేవ్ ఎలాంటి ప్రస్తావన నేరుగా తీసుకురాలేదు.
కళ్యాణ్‌దేవ్, శ్రీజ దంపతులు 2016లో వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా జన్మించింది. ఈ పాపకు నవిష్క అని నామకరణం చేశారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని నెలలుగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. శ్రీజ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై కళ్యాణ్‌దేవ్ మాత్రం నోరు విప్పడం లేదు. శ్రీజ గతంలో మానసిక వేదనకు గురైనప్పుడు రామ్‌చరణ్ తన సోదరిని వెకేషన్‌కు కూడా తీసుకువెళ్లాడు. ఈ ఏడాది అయినా కళ్యాణ్ దేవ్, శ్రీజల వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేస్తుందేమో చూడాలి. ఇప్పటికే నవిష్కకు కళ్యాణ్ దేవ్ దూరంగా ఉంటున్నాడు. నవిష్క బర్త్ డేను కూడా కళ్యాణ్ దేవ్ సెలెబ్రేట్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. కనీసం తన కూతురిని కూడా చూసుకోలేకపోతున్నాడు. చిరంజీవి ఫ్యామిలీ అభ్యర్ధన మేరకే కళ్యాణ్ దేవ్ విడాకుల ప్రకటన మీడియాలో షేర్ చేయలేదని సమాచారం. కాగా కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. అవికా గోర్‌తో కలిసి అతడు ఒక చిత్రంలో నటిస్తున్నాడు. కళ్యాణ్ దేవ్ పెట్టిన లేటెస్ట్ పోస్టుకు అవికా గోర్ ‘హగ్’ అంటూ కామెంట్ పెట్టింది.