
తెలుగులో కొన్ని ప్రేమకథా చిత్రాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే ప్రేమకథల్లో ఆనందం సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు రేఖ వేదవ్యాస్ హీరోయిన్గా పరిచయం అయ్యింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై ఆనందం సినిమాను రామోజీరావు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూర్చాడు. అతడి మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే హీరోయిన్ రేఖకు ఈ మూవీతో ఆనందం రేఖ అని పేరు వచ్చింది. ఆనందం తర్వాత తెలుగులోనే ఆమె ఓ పది సినిమాల వరకూ చేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవల కొన్ని ఫోటో షూట్లలో రేఖ పాల్గొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆమె కనిపించడంతో అభిమానులు రేఖను చూసేందుకు ఇంట్రస్ట్ చూపించారు. కానీ రేఖను చూసిన తర్వాత కొంతమంది అభిమానులు నోరెళ్లబెట్టారు. అప్పటికీ ఇప్పటికీ రేఖ ముఖంలో చాలా మార్పులు సంభవించాయి. గుర్తుపట్టలేనంత విధంగా రేఖ మారిపోవడంతో కొంతమంది షాక్‌కు గురయ్యారు. మెరుపుతీగలా ఉండే రేఖ బొద్దుగా మారిపోయింది. అందంగానే ఉన్నా మునుపటిలా లేదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. లేటు వయసులోనూ అందాలను ఆరబోయడంలో రేఖ తనకు తానే అని నిరూపించుకుంది. గ్లామర్ డోస్ పెంచడంతో త్వరలో తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. అమ్మ, ఆంటీ పాత్రలు రేఖకు సూటవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాగా హీరోయిన్ రేఖ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. సినిమాల్లోకి రాకముందు ఆమె మోడలింగ్ చేసింది. మోడలింగ్ కారణంగా ఆమెకు కన్నడలో చిత్రం రీమేక్‌లో నటించే అవకాశం వచ్చింది. కన్నడ సినిమాను కూడా తెలుగులో నిర్మించిన రామోజీరావే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో మంచి మార్కులు పడటంతో తెలుగులో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ఆనందం సినిమాలో అవకాశం కల్పించారు. ఈ సినిమాలో ఆకాష్ హీరోగా నటించాడు. ఆనందం సినిమా పెద్ద హిట్ కావడంతో వరుస అవకాశాలు రేఖకు వచ్చాయి. జానకి వెడ్స్ శ్రీరామ్, జాబిలి, దొంగోడు, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్న సమయంలోనే ఆమె కన్నడలోకి వెళ్లిపోయింది. తనకు బుర్ర లేకపోవడంతోనే తెలుగు సినిమాలను వదులుకుని కన్నడకు వెళ్లిపోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేఖ చెప్పుకొచ్చింది. తాను తెలుగులో కొనసాగి ఉంటే కెరీర్ ఇంకా బాగుండేదని అభిప్రాయపడింది. మణిరత్నం లాంటి దర్శకుడితో ఓ ఆఫర్ వచ్చినా బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
1
2
3
4
5
6
7