
మన టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో మాస్ హీరో ఎవరు అని అడిగితె మనకి టక్కుమని గుర్తుకు వచ్చే జూనియర్ ఎన్టీఆర్..ఆయనకీ ఉన్నంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ నేటి తరం హీరోలలో ఎవరికీ లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయనకీ అలాంటి కల్ట్ మాస్ ఫ్యాన్ బేస్ రావడానికి కారణమైన సినిమాలు ఆది మరియు సింహాద్రి అని చెప్పొచ్చు..ఈ రెండు సినిమాలే అతనిని మాస్ లో తిరుగులేని హీరోని చేసాయి..నూనూగు మీసాలు కూడా రాని వయస్సులో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది ఈ సినిమాలతోనే..మళ్ళీ ఎన్టీఆర్ కెరీర్ లో ఆ రేంజ్ మాస్ సినిమాలు రాలేదనే చెప్పాలి..ఇక ఆది సినిమాతో VV వినాయక్..మరియు సింహాద్రి సినిమాతో రాజమౌళి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా అవతరించారు..అయితే ఈ సినిమాలు తెరకెక్కేముందు చాలా హైడ్రామానే జరిగింది అనాలి..అవేమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
VV వినాయక్ తో సినిమా చెయ్యడానికి తొలుత ఎన్టీఆర్ ఒప్పుకోలేదట..అయితే తన సన్నిహితుల ఒత్తిడి కారణంగా అతనికి అప్పోయింట్మెంట్ ఇచ్చి కాసేపు కథ విని నచ్చలేదని చెప్పి పంపడానికి సిద్ధంగా ఉన్నాడట ఎన్టీఆర్..వినాయక్ ఎన్టీఆర్ ఇంటికి రాగానే ‘పది నిమిషాల్లో కథ పూర్తి చెయ్యాలి’ అని చెప్పడట ఎన్టీఆర్..కానీ వినాయక్ కథ వినిపించిడం ప్రారంబించినా తర్వాత ఎన్టీఆర్ కి సమయమే తెలియలేదట..అలా పది నిమిషాల్లో పూర్తి అవ్వాల్సిన న్యారేషన్ 3 గంటల వరుకు సాగిన ఎన్టీఆర్ ఎంతో ఓపికగా వింటూ వచ్చాడట..ఇలాంటి కథ కోసం నేను ఎదురు చూస్తున్నాను..ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పాడట ఎన్టీఆర్..ఇక ఆ తర్వాత ఈ సినిమా ప్రారంభం అవ్వడం, భారీ లెవెల్ లో విడుదల అయ్యి సంచలన విజయం సాధించడం అన్ని అలా జరిగిపోయాయి..అయితే ఆది సినిమాని తొలుత బాలయ్య బాబు తో తియ్యాలనుకున్నాడట వినాయక్..ఆయనని కలిసి ఈ స్టోరీ చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడట..కానీ ఆయనకీ అప్పట్లో బాలయ్య బాబు ని కలిసే అవకాశం కూడా దక్కకపోవడం తో ఈ స్క్రిప్ట్ ని మూలానపడేశారట.
ఇక ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 విడుదలై భారీ హిట్ అయ్యింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి తాను రాసుకున్న ఆది స్క్రిప్ట్ కి ఈ హీరో అయితేనే న్యాయం చెయ్యగలడు అని భావించి ఎన్టీఆర్ ని కలవడానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మొత్తానికి అతని తో సినిమా తీసి ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్ ని కొట్టాడు ఎన్టీఆర్..అలా బాలయ్య బాబు కోసం రాసుకున్న స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ తో చేసాడు వినాయక్..సింహాద్రి సినిమా కూడా అలాంటిదే..ఈ సినిమా ని తొలుత ప్రభాస్ తో తీద్దాం అనుకున్నాడు రాజమౌళి, కానీ ఎందుకో ప్రభాస్ ఇందులో నటించడానికి ఒప్పుకోలేదు..ఆ తర్వాత బాలయ్య బాబు తో చేద్దాం అనుకున్నాడు..అది కూడా కుదర్లేదు..చివరికి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోనే చేసాడు..ఇది కూడా ఎంత సంచలన విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే..అలా ఎన్టీఆర్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన ఈ రెండు సినిమాలు బాలయ్య బాబు వదులుకున్నవే అవ్వడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.