
బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం చివరి దశకి చేరుకున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం హౌస్ లో టికెట్ 2 ఫినాలే టాస్కు ఆసక్తికరంగా సాగుతుంది..ఈ టాస్కులో ఎవరు గెలవబోతున్నారు..ఎవరు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు అనేది ఈరోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే..ప్రస్తుతానికి అయితే ఆది రెడ్డి తన ప్రత్యర్థులందరి కంటే ఎక్కువ పాయింట్స్ తో టికెట్ 2 ఫినాలే టాస్కులో కొనసాగుతున్నాడు..ఒకవేళ అతను టికెట్ 2 ఫినాలే టాస్కు లో చివరి వరుకు అదే ఆధిక్యత కొనసాగిస్తే కచ్చితంగా టాప్ 5 లోకి వెళ్తాడు..లేకపోతే ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోతాడు..అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ వారం బిగ్ బాస్ లో డబల్ ఎలిమినేషన్ ఉంటుందని..ఈ డబుల్ ఎలిమినేషన్ వోటింగ్ లైన్ లో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఆది రెడ్డి మరియు ఫైమా ఎలిమినేట్ అయ్యిపోతారని..ఇలా సోషల్ మీడియా లో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఒకవేళ ఆది రెడ్డి టికెట్ 2 ఫినాలే టాస్కులో గెలిస్తే ఈ వారం ఎలిమినేషన్స్ నుండి అతను తప్పించుకుంటాడు..అతని స్థానం లో స్వల్ప ఓట్ల ఆధిక్యం లో ఉన్న శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోతుంది..అప్పుడు టాప్ 6 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీహన్ , రోహిత్ , కీర్తి , ఇనాయ మరియు ఆది రెడ్డి నిలుస్తారు..వచ్చే వారం నామినేషన్స్ లోకి కీర్తి వస్తే ఆమె ఎలిమినేట్ అయిపోతుంది..అప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా ఆది రెడ్డి తో పాటుగా రేవంత్ , శ్రీహాన్ , రోహిత్ మరియు ఇనాయ నిలుస్తారు..ఒకవేళ ఆది రెడ్డి టికెట్ 2 ఫినాలే టాస్కు గెలవకపోతే మాత్రం శ్రీ సత్య ఈ వారం ఉంటుంది..ఒకవేళ ఆమె తదుపరి వీక్ లో నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంది లేకపోతే టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుంది..పాపం ఇప్పుడు శ్రీ సత్య కలలన్నీ ఆది రెడ్డి చేతుల్లో ఉంది అన్నమాట.
అయితే సోషల్ మీడియా లో శ్రీ సత్య కంటే ఆది రెడ్డి కి ఎక్కువ సపోర్టు ఉంది..ఎందుకంటే ఆది రెడ్డి కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు..ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి చివరి వరుకు ఉండడం అంటే మాములు విషయం కాదు..ఇక్కడి వరుకు వచ్చి ఇప్పుడు టాప్ 5 లోకి ఆది రెడ్డి అడుగుపెట్టకపోతే అందరికి బాధ వెస్తాది..అందుకే ఆది రెడ్డి సేఫ్ అవ్వాలి..టికెట్ 2 ఫినాలే టాస్కు విన్ అవ్వాలని ఆయనని అభిమానించే వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు..మరి బిగ్ బాస్ లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు..ఈమధ్య టాస్కులు ఎలా ఉన్న ఎలిమినేషన్స్ విషయం లో మాత్రం బిగ్ బాస్ ట్విస్టులు మాములుగా ఉండడం లేదు..బాగా ఆడుతున్నారు..కచ్చితంగా విన్ అవుతారు అని అనుకున్న కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యి బయటకెళ్లారు..అంచనాలకు అందకుండా ఎలిమినేషన్స్ బిగ్ బాస్ లో జరగడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు..మరి ఈ వారం ఏమి జరుగుతుందో చూడాలి.