
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి తన తన ఆట తీరుతో, తన నడవడిక తో ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం కలిగించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు ఆది రెడ్డి..ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన కంటెస్టెంట్ ఎవ్వరూ లేరు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఎంటర్టైన్మెంట్ లో కాస్త వీక్ అని ముందు నుండి ఆది రెడ్డి కి పేరు ఉండేది..ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో కూడా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు..ఇన్ని రోజులు అయితే బలంగా నెట్టుకొచ్చాడు కానీ..టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..టికెట్ 2 ఫినాలే టాస్కులో ముందుకి దూసుకొచ్చినా చివరి నిమిషం లో మాత్రం సరిగా ఆడలేక కష్టపడినా పాయింట్స్ మొత్తం టై బ్రేకర్ టాస్కు లో పోగొట్టుకొని టికెట్ 2 ఫినాలే టాస్కు నుండి వైదొలగడం ఆడియన్స్ కి పాపం అనిపించింది.
ఇక ఆది రెడ్డి కి మొదటి రోజు నుండి సపోర్టు గా హౌస్ లో ఉంటూ వచ్చిన కంటెస్టెంట్ గీతూ..ఈమె ఎలిమినేషన్ ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి..ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈమె బయట ఆది రెడ్డి తో తనకి ఉన్న రిలేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది..ఇక ఈ వారం పలు కారణాల వల్ల ఆదిరెడ్డి గ్రాఫ్ తగ్గిపోవడం పై గీతూ చాలా ఫీల్ అయిపోయింది..ఇంస్టాగ్రామ్ లో నిన్న రాత్రి ఆమె పెట్టిన ఒక పోస్టు తెగ వైరల్ గా మారిపోయింది..ఆమె మాట్లాడుతూ ‘టికెట్ 2 ఫినాలే టాస్కు లో ఆది రెడ్డి గెలిచాడు అనే రూమర్ సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవ్వడం వల్ల..ఈ వారం ఆది రెడ్డి కి ఓట్లు బాగా తగ్గిపోయాయి..అతను ఎలిమినేట్ ఐపోతాడేమో అని నాకు భయంగా ఉంది..అతని తలరాత ఎలా ఉందొ చూడాలి..ఈరోజు వోటింగ్ కి ఆఖరి రోజు..దయచేసి అందరూ వోట్ వెయ్యండి’ అంటూ ఒక పోస్టు షేర్ చేసింది.
అంతే కాకుండా ఆది రెడ్డి ఎలిమినేట్ అవ్వకుండా ఉండేందుకు..అతను టాప్ 5 లో కొనసాగేందుకు గీతూ ఉపవాసం కూడా ఉంటుందట..ఆమె ఒకరికోసం ఇంతలా ఆలోచించడం ఎప్పుడు చూడలేదంటూ గీతూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు..ఒకరోజు హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఆది రెడ్డి ఎలిమినేట్ ఐపోతాడేమో అనే భయం తో ఆమె ఎలా ఏడ్చిందో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..నిజమైన అన్నయ్య అనే ఫీలింగ్ ఆమెకి ఆది రెడ్డి తోనే కలిగింది అని చెప్పొచ్చు..చూడాలి మరి ఆది రెడ్డి ఫైనల్స్ కి వెళ్తాడా లేదా టాప్ 6 గానే వెనుతిరుగుతాడా అనేది.