
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో కుర్రకారుల మనసు దోచుకున్న లేడీ కంటెస్టెంట్ శ్రీ సత్య..ఈమెకి సోషల్ మీడియా లో మాములు క్రేజ్ లేదనే చెప్పాలి..యూట్యూబ్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచినా ‘తొందరపడకు సుందర వదనా’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె అంతకు ముందు టీవీ సీరియల్స్ లో విలన్ గా నటించేది..మధ్యలో ‘నేను శైలజ’ సినిమాలో ఒక చిన్న రోల్ లో తళుక్కుమని మెరిసింది..అలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే మంచి క్రేజ్ దక్కించుకున్న ఈమె , బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత లక్షల్లో అభిమానులను సొంతం చేసుకుంది..హౌస్ లోకి వచ్చిన రోజు నుండి టాస్కులు ఆడడం లో అద్భుతంగా రాణించిన ఈమె ఇప్పుడు తన గ్రాఫ్ ని కొన్ని చేష్టల ద్వారా తగ్గించుకుంటూ పోతుంది..శ్రీ సత్యనేనా ఇలా చేస్తుంది అని ఆమె అభిమానులు సైతం షాక్ కి గురైయ్యారు.
గత వారం కెప్టెన్సీ టాస్కు లో శ్రీ సత్య మంచిగానే రాణించింది..పోయినవారం కెప్టెన్ అయినా ఆమె ఈ వారం కూడా ఎలా అయినా కెప్టెన్ అవ్వాలనే కసి తో టాస్కుని చాలా సీరియస్ గా తీసుకొని ఆడింది..ఎందుకంటే వచ్చే వారం ఆమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంది అనే భయం కాబోలు..అయితే కెప్టెన్ అవ్వాలనే కసి తో ఆమె చేసిన కొన్ని పనులు ఛీ కొట్టేలా చేసింది..కెప్టెన్సీ టాస్కులో చివరి రౌండ్ ‘వస్తా నీ వెనుక’ టాస్కులో థెర్మో కోల్ బాల్స్ తో నిండిన బస్తాలను భుజాన వేసుకొని గ్రౌండ్ మీద గీసి ఉన్న సర్కిల్స్ చుట్టూ తిరగాలి..ఇంటి సభ్యులు బస్తాలో ఉన్న థెర్మో కోల్స్ ని కాపాడుకునేందుకు ప్రయత్నం చెయ్యాలి..అలా చివరి వరుకు ఎవరి బస్తాలో ఎక్కువ థెర్మో కోల్స్ ఉంటాయో..వాళ్ళు విజేతగా నిలిచి ఇంటి కెప్టెన్ అవుతారు..ఈ టాస్కులో కంటెండర్లు కారి బస్తాపై ఒకరు దాడి చేసుకోవచ్చు.
అలా ఆది రెడ్డి శ్రీ సత్య భుజం మీద ఉన్న బస్తాని కదిలించి థెర్మో కోల్ బాల్స్ ని క్రింద పడేసే ప్రయత్నం చేస్తాడు..తన బస్తాపై చెయ్యి వెయ్యబోతున్న ఆది రెడ్డి చేతులపై ముద్దుల వర్షం కురిపిస్తుంది శ్రీ సత్య..ఆది రెడ్డి అప్పుడు ‘పెట్టు పెట్టు ఇంకా పెట్టు’ అని అడుగుతాడు..ఒక గేమ్ కోసం ఇంతలా దిగజారాలా అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో శ్రీ సత్య ని తిడుతారు..గతంలో కూడా ఇంటి సభ్యులు మధ్య రొమాన్స్ జరిగింది కానీ అది సహజం గా ఉండేది..శ్రీ సత్య కేవలం ఒక గేమ్ లో గెలవడం కోసం ఇలా చెయ్యడం ఏంటి చూసేదానికి చాలా చీప్ గా ఉందంటూ ఆమె అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు..శ్రీ సత్య ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆమె అభిమానులు వాపోతున్నారు..అయితే మరో విశేషం ఏమిటంటే ఈ సీన్ ని టీవీ లో టెలికాస్ట్ చెయ్యలేదు..ఎడిట్ చేసి వదిలారు..కానీ డిస్నీ + హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది..అందులో ఈ సీన్ కనపడింది..సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఈ వీడియో క్లిప్ ని కట్ చేసి పోస్ట్ చేసారు..అది బాగా వైరల్ అయ్యింది.