Home Entertainment ఆదిపురుష్ టీజర్ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్

ఆదిపురుష్ టీజర్ పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్

0 second read
0
0
714

సుమారు 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రాత్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో తీస్తున్న చిత్రం ‘ఆది పురుష్’..శ్రీ రాముడి చరిత్ర ని మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో సరికొత్తగా తీసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ ఓం రాత్..నిన్న అయోధ్య లో ఒక భారీ ఈవెంట్ ని పెట్టి ఆదిపురుష్ టీజర్ ని విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ టీజర్ కి అభిమానుల నుండి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది..ఎదో కార్టూన్ సినిమాని చూస్తున్నట్టు ఉంది..ఆ గ్రాఫిక్స్ అంత చెత్తగా ఉన్నాయి ఏంటి అంటూ డైరెక్టర్ ఓం రాత్ ని టాగ్ చేసి తిడుతున్నారు..అంతే కాకుండా శ్రీ రాముడిగా ప్రభాస్ లుక్ కూడా అంతంత మాత్రం గానే ఉందని..ఇక రావణాసురుడి కి స్పైక్స్ హెయిర్ స్టైల్ ఏంటి..అసలు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు అంటే ఎవరైనా నమ్మెల్యేగా ఉందా ఆ గెటప్..డైరెక్టర్ రామాయణం ని అపహాస్యం చేసేందుకే ఈ ఆదిపురుష్ సినిమా తీసాడా అంటూ విమర్శిస్తున్నారు ప్రేక్షకులు.

ఇక శ్రీ రాముడి గెటప్ లో ప్రభాస్ ప్రీ లుక్ విడుదలైనప్పటి నుండే సోషల్ మీడియా లో ఒక రేంజ్ ట్రోల్ల్స్ ఏర్పడ్డాయి..ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే శ్రీ రాముడిగా ప్రభాస్ కంటే రామ్ చరణ్ బాగుంటాడు..ఆది పురుష్ సినిమాని రామ్ చరణ్ తో తియ్యల్సింది అంటూ పోల్చడం ప్రారంభించేలోపు సోషల్ మీడియా లో ప్రభాస్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి..అంతే కాకుండా శ్రీ రాముడిగా ఎవరు బాగున్నారు అంటూ రామ్ చరణ్ మరియు ప్రభాస్ లుక్స్ ని పక్కపక్కన పెట్టి వోటింగ్స్ పెట్టగా రామ్ చరణ్ కె ఎక్కువ ఓట్లు వచ్చాయి..ప్రభాస్ తో సలార్ భారీ బడ్జెట్ సినిమాని తీస్తున్న ప్రశాంత్ నీల్ కూడా రామ్ చరణ్ కి వోట్ వెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..మా హీరో తో అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఇలాంటి పొలింగ్స్ లో పాల్గొనడానికి సిగ్గు లేదా అంటూ ప్రభాస్ ఫాన్స్ ప్రశాంత్ నీల్ ని టాగ్ చేసి బాగా తిట్టడం ప్రారంభించారు..ఇలా సోషల్ మీడియా మొత్తం ఆది పురుష్ ఫస్ట్ లుక్ పెద్ద వివాదాలకు దారి తీసింది.

ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు అయితే రామ్ చరణ్ ని తెగ లేపేస్తున్నారు..వాస్తవానికి #RRR సినిమాలో రామ్ చరణ్ వేసింది అల్లూరి సీతారామరాజు పాత్ర..కానీ అందరూ రాముడితో ఎలా పోలుస్తున్నారు అంటూ ప్రభాస్ ఫాన్స్ విమర్శలు చేసారు..రామ్ చరణ్ అల్లూరి పాత్రే అయినప్పటికీ కూడా బాలీవుడ్ ప్రేక్షకులు ఆయన గెటప్ ని శ్రీ రాముడితో పోల్చి చూసారు..అందుకే ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..శ్రీ రాముడిని బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మన అందరికి తెలిసిందే..ఆది పురుష్ సినిమాకి అక్కడ తిరుగేలేదని..కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే సినిమాగా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…