
ఇటీవల కాలం లో మన టాలీవుడ్ లో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ..ఎంతో మంది దిగ్గజ నటీనటులు అనుకోని కారణాల వల్ల మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..ఈ బాధ నుండి ఇంకా మనం తేరుకోలేదు..ఈలోపే మరో దుర్ఘటన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చోటు చేసుకుంది ..ద్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు గారి ఆఖరి కూతురు..ఆయన గారాల పట్టి ఉమామహేశ్వరి గారు నిన్న తన స్వగృహం లో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు..ఈ ఘటన నందమూరి అభిమానులను తీవ్రమైన దుఃఖం లో ముంచేసింది..తెలుగు జాతి గర్వపడే విధంగా ఎన్నో అద్భుతమైన ఘట్టాలను మనకి అందించిన మహానటుడు రామారావు గారి కూతురు కి ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమి వచ్చింది అంటూ నందమూరి కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తీవ్రమైన శోకం లో మునిగిపోయారు..కష్టం వచ్చింది అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది సోదరులు మరియు ఆత్మీయులు సహాయం చెయ్యడానికి ముందుకి వస్తారు..అలాంటి కుటుంబం లో పుట్టిన ఒక మనిషి, ఎన్టీఆర్ గారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తెలిస్తే స్వర్గం లో ఉన్న రామారావు గారి ఆత్మా తట్టుకోగలదా..అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో భోరున విలపిస్తున్నారు.
ఇంతకీ ఉమామహేశ్వరి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే దాని పై అభిమానులు మరియు బందు మిత్రులు ఆరా తీస్తున్నారు..అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న సమాచారం ప్రకారం ఉమామహేశ్వరి గారు చాలా కాలం నుండి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..స్వతహాగా ఆమె ఎంతో ఆత్మవిశ్వాసం గలిగిన మనిషి..ఎవరి సహాయం కోరే రకం కాదు..తనకి బాగాలేని సమయం లో తనకు సేవలు చెయ్యడం కోసం కుటుంబ సభ్యులు పడుతున్న తపన ఆమెకి భారంగా అనిపించింది..అయ్యో నేను ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నానే అంటూ మానసికంగా ఎంతో కుములిపోయింది..అందుకే ఒక్కరికి భారం కాకూడదనే ఆత్మా హత్య చేసుకొని ప్రాణాలను విడిచింది..ఆమె తానూ ఒక్కప్పుడు రాసుకున్న వ్యక్తిగా లేఖలు చూస్తే తాను ఎంత మంచి మనిషో..ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అనే తత్త్వం ఆమెలో ఎంత ఉందొ అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఏది ఏమైనా నందమూరి కుటుంబానికి మరియు వారి అభిమానులకు ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తీవ్రమైన మనస్తాపానికి చెందే విషయం అనే చెప్పొచ్చు.
ఉమామహేశ్వరి గారి భర్త పేరు శ్రీనివాస ప్రసాద్ గారు..ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు..ఇప్పుడు ఆ ఇద్దరి బిడ్డలకు తమ తల్లి ఇక లేదు అనే బాధ ని లోటుని ఎవరు పూడ్చగలరు అంటూ అభిమానులు వాపోతున్నారు..ఆగస్టు నెల నందమూరి కుటుంబానికి ఒక పీడ కల..ఇదే నెలలో నందమూరి హరికృష్ణ గారు కారు యాక్సిడెంట్ ప్రమాదం లో తన ప్రాణాలను వదిలాడు..ఇదే నెలలో హరికృష్ణ గారి పెద్ద కొడుకు నందమూరి జానకి రామ్ గారు కళ్ళు మూసారు..ఇలా ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలించింది ఈ నెల..వాళ్లిద్దరూ దురదృష్టం కొద్దీ రోడ్డు ప్రమాదం లో చనిపోయారు,కానీ ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు..ఎన్టీఆర్ గారు నేడు బౌతికంగా మన మధ్య ఉంటె ఇలాంటి సంఘటన విని ఆయన తట్టుకోగలరా..ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు ఆత్మహత్య చేసుకుంది అంటే ఆయన ఎంతలా కుమిలిపొయ్యేవారో..ఏది ఏమైనా జరిగింది ఎవ్వరు మార్చలేరు..ఆమె ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిని కోరుకోవాలి అని మాత్రమే ప్రార్థన చెయ్యగలం.