Home Entertainment ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన దిల్ రాజు

0 second read
0
3
19,538

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇటీవల ఓటీటీలు రాజ్యమేలుతున్న తరుణంలో తొలిరోజు డివైడ్ టాక్ వచ్చిన సినిమాలు వసూళ్ల పరంగా నిరాశపరుస్తున్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆచార్య విషయంలోనూ అదే రిపీటైంది. దీంతో ఆచార్య సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. అయితే ఆచార్య సినిమా విషయంలో నైజాంలో విపరీతమైన కాంపీటేషన్ ఏర్పడింది. దిల్ రాజుకు పోటీగా ఈ సినిమా హక్కులను కైవసం చేసుకునేందుకు వరంగల్ శీను తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు రూ.42 కోట్లు పెట్టి ఆచార్య డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే వరంగల్ శీను దారుణంగా నష్టపోయాడు. దిల్ రాజు కన్నా ఎక్కువ మొత్తం చెల్లించి శీను మెగా సినిమా హక్కులను దక్కించుకోగా డిజాస్టర్ టాక్ వల్ల దాదాపు రూ.20 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి వరంగల్ శీనునే కారణమని దిల్ రాజు తన సన్నిహితుల దగ్గర ఆరోపిస్తున్నట్లు కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. తనతో పోటీ పడి వరంగల్ శీను ఈ సినిమా హక్కులను దక్కించుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఒకవేళ ఈ రైట్స్ తనకు ఇచ్చి ఉంటే మూవీలోని కంటెంట్‌కు తగిన విధంగా పబ్లిసిటీ చేసేవాడినని.. అప్పుడు నైజాంలో ఇంత నష్టాలు వచ్చేవి కావని దిల్ రాజు అభిప్రాయపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తు్న్నాయి. దీంతో తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయని అందరూ భావిస్తున్నారు. ఆచార్య సినిమా విషయంలో అయితే దర్శకుడు కొరటాల శివ.. దిల్ రాజుని పక్కనెట్టి వరంగల్ శీనుకి నైజాం డిస్ట్రిబ్యూషన్ అప్పగించారనే టాక్ కూడా వినిపిస్తోంది. మహేష్ బాబు నటించిన భరత్‌ అనే నేను సినిమా విషయంలో దిల్‌ రాజు, కొరటాలకు మధ్య చిన్న తగాదాలు రావడంతో ఆచార్య మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజుకి దక్కకుండా వరంగల్ శీనుకి అప్పగించినట్టు తెలుస్తోంది.

కాగా మహేష్‌బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా నైజాం హక్కులు కూడా వరంగల్ శీనునే దక్కించుకున్నట్లు సమాచారం అందుతోంది. గతంలో రవితేజ క్రాక్ సినిమాతో దిల్ రాజుని ఢీ కొట్టి లాభాలను గడించిన వరంగల్ శీను అనంతర కాలంలో అల్లరి నరేష్ నాంది, విశాల్ చక్ర, నితిన్ చెక్ సినిమాలను పంపిణీ చేశాడు. ఇప్పుడు పెద్ద సినిమాల వైపు అతడి చూపు మళ్లింది. ఆచార్య, సర్కారువారిపాట సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా లైగర్ హక్కులు కూడా వరంగల్ శీనుకే దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నో ఆశలతో భారీ రేటు పెట్టి కొనుగోలు చేసిన ఆచార్య సినిమా ఇప్పుడు డిజాస్టర్‌గా నిలవడంతో వరంగల్ శీను భారీగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుని కంగారు పడవద్దని.. తన తదుపరి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వడంతో పాటు కొంత పరిహారం చెల్లిస్తానని చెప్పడంతో వరంగల్ శీను మళ్ళీ ఊపిరిపీల్చుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…