
మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ఆచార్య సినిమా ఇటీవలే భారీ అంచానాల నడుమ విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి బాక్స్ ఆఫీస్ కింగ్స్ చేసిన సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..దానికి తోడు కొరటాల శివ వంటి అపజయం ఎరుగని డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయం అని అందరూ అనుకున్నారు..కానీ ఆ అంచనాలను అన్నిటిని ఈ సినిమా మొదటి రోజు నుండే తలకిందులు చేస్తూ వచ్చింది..మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ లో కూడా బాగా దెబ్బతిన్నది..40 ఏళ్ళ మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ ని ఎప్పుడు చూడలేదు అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు..ఇద్దరు మాస్ హీరోలను పెట్టుకొని కొరటాల చాలా గ్రాంటెడ్ గా తీసుకొని ఈ సినిమా చేసాడు అని..ఒక్క సన్నివేశం కూడా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు అని అభిమానులు పెదవి విరుస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే టాక్ తో సంబంధం లేకుండా మొదటి మూడు రోజులు అదిరిపొయ్యే ఓపెనింగ్స్ రావడమే ఇది వరుకు మనం చూస్తూ వచ్చాము..కానీ మొట్టమొదటి సారి కనీసం ఓపెనింగ్స్ ని సైతం దక్కించుకోలేదు అంటే ఎక్కడ పొరపాటు జరిగిందో ట్రేడ్ పండితులకు సైతం అంతుచిక్కని ప్రశ్న..ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది అని,ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగంచలేక పొయ్యింది అని..అందుకే ఓపెనింగ్స్ ని సైతం ఈ సినిమా దక్కించుకోలేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇది పక్కన పెడితే సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ప్రచారం అవుతున్న ఒక్క వార్త ఇప్పుడు అభిమానులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తోంది..అదేమిటి అంటే ఈ సినిమాని సగానికి పైగా మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించాడు అని, కొరటాల శివ కేవలం పర్యవేక్షణ మాత్రమే చూసుకున్నాడు అని టాక్ వినిపిస్తుంది..ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాలు చిరంజీవి స్వయంగా రాసుకున్నాడు అని..కాజల్ గర్వాల్ ట్రాక్ కూడా ఆయనే రాసాడు ..కానీ ఆమె పార్ట్ షూటింగ్ చేసిన తర్వాత సినిమాలో చూడడానికి చాలా నీచంగా అనిపించడం తో ఆమె సన్నివేశాలు అన్ని తొలగించారు అని ఇలా పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం సాగాయి.
వాస్తవానికి కొరటాల శివ రాసుకున్న కథ వేరే అని..కానీ రామ్ చరణ్ ని ఈ సినిమాలో నటింపచేయడానికి చిరంజీవి కొరటాల శివ వద్ద ఉన్న మరొక్క స్క్రిప్ట్ ని ఎంచుకొని ,ఆయనే మార్పులు చేర్పులు చేసాడు అని వినికిడి..తొలుత సిద్ద పాత్రం కోసం మహేష్ బాబు ని అనుకున్నారు అని..కానీ సురేఖ గారి కోరిక మేరకు రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్ సెట్ అయ్యింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలీదు కానీ , కొరటాల శివ మాత్రం ఈ సినిమాకి అసలు న్యాయం చెయ్యలేకపోయాడు అనే చెప్పాలి..ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో కూడా కొరటాల శివ మాట్లాడుతూ ‘ఈ సినిమాకి నేను పని చేసింది చాలా తక్కువ ..వాళ్లిదరు అలా కెమెరా ముందు రాగానే నేను కూడా వాళ్ళతో పాటు పూర్తిగా లీనం అయిపోయాయి చూస్తూ ఉన్నా..ఆ అద్భుతమైన మూమెంట్స్ ని నేను కెమెరా తో కాప్చర్ చేశా అంతే’ అంటూ పరోక్షంగా ఈ సినిమాకి నేను ఎక్కువ శాతం దర్శకత్వం వహించలేదు అంటూ హిట్ ఇచ్చాడు,అంటే ఈ సినిమాకి చిరంజీవి గారు డైరెక్షన్ లో వేలు పెట్టాడు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వచ్చాయి..ఈ కామెంట్స్ పై కొరటాల శివ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.