Home Entertainment ఆచార్య సినిమా పరాజయం పై మొదటిసారి పెదవి విప్పిన మెగాస్టార్

ఆచార్య సినిమా పరాజయం పై మొదటిసారి పెదవి విప్పిన మెగాస్టార్

0 second read
0
0
12,153

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ చతికిలపడింది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస సూపర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివకి ఈ చిత్రం తొలి ఎదురుదెబ్బ. మెగా అభిమానులు ఆచార్య మూవీ ఫెయిల్యూర్‌ను జీర్ణించుకోలేకపోతున్నారు. కొరటాల స్క్రిప్ట్, దర్శకత్వం పూర్తిగా బెడిసికొట్టాయి. దీనికి తోడు సంగీతం పరంగా మణిశర్మ కూడా తేలిపోయాడు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మే 20 నుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నా పెద్దగా పట్టించుకునే నాథుడు లేడు. ఓటీటీలోనూ ఈ సినిమాకు దారుణమైన వ్యూస్ వచ్చినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. వెండితెరపై ఆడని సినిమాలను కూడా ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆచార్య చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కానీ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని టాక్ నడుస్తోంది.

మెగాస్టార్ వంటి స్టామినా ఉన్న నటుడు నటించిన ఆచార్య సినిమాను ఓటీటీలోనూ ప్రేక్షకులు పట్టించుకోకపోవడంపై మెగా అభిమానులు అవమానంగా భావిస్తున్నారు. స్టార్ హీరో చిత్రాన్ని ఈ స్థాయిలో రిజెక్ట్ చేయడం ఈ మధ్యకాలంలో జరగలేదని మెగా అభిమానులు వాపోతున్నారు. అమెజాన్ సంస్థకు కూడా ఆచార్య మూవీ భారీ నష్టాలనే మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా దారుణ ఫలితానికి అందరూ దర్శకుడు కొరటాల శివనే నిందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ మీద పెట్టినంత శ్రద్ధ ఆయన సినిమా స్క్రిప్ట్‌పై పెట్టి ఉంటే ఆచార్య కథ మరోలా ఉండేదని మెగాస్టార్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తో్ంది. ఆచార్య చిత్రం ఫెయిల్యూర్ పై చిరంజీవి ఇంకా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన ఫ్యూచర్ చిత్రాల విషయంలో ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలని మెగాస్టార్ భావిస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిపి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మించాడు. ఈ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు.

ఆచార్య సినిమాకు మొదటి షోనుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. ఈ సినిమాను భారీ ధరకు కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రస్తుతం దర్శక నిర్మాతలు కొంత డబ్బును వాపస్ ఇస్తున్నారు. అందులో భాగంగా నిర్మాతల తరుపున కొరటాల శివ బయ్యర్లతో చర్చలు జరిపి తమకు వచ్చిన నష్టాన్ని కొంతమేరకు పూడ్చాలని చూస్తున్నారు. అయితే అందరిలో ఎక్కువగా నష్టపోయింది మాత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అని తెలుస్తోంది. ఆయనకు దాదాపు రూ.14 కోట్ల మేరకు పరిహారం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరంగల్ శ్రీనుతో పాటు మిగిలిన డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం. కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి చిత్రానికి వెళ్లే ముందు ఈ తంతును క్లియర్ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఆచార్య పరాజయం తర్వాత ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయడానికి శివ తొందరపడటం లేదు. అందులో భాగంగా స్క్రిప్ట్ పక్కాగా ఉండేలా చూసుకోవడానికి కొరటాల శివ తన సమయాన్ని వెచ్చించాలని అనుకుంటున్నారట.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…