
ఇటీవల కాలం లో ప్రేక్షకులను మరియు అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఆచార్య’..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడం..దానికి తోడు అపజయం అనేదే ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించడం తో ఈ చిత్రం పై అటు అభిమానుల్లోనూ మరియు ట్రేడ్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి..మార్కెట్ లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని సరిగ్గా కాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో కొరటాల శివ ఈ సినిమా హక్కులను మొత్తం నిర్మాత నిరంజన్ రెడ్డి నుండి ఫాన్సీ రేట్ 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి అన్ని ప్రాంతాలకు కలిపి 130 కోట్ల రూపాయలకు అమ్మి విడుదలకి ముందే 50 కోట్ల రూపాయిల లాభలను ఆర్జించాడు..కానీ కొరటాల నేతి మీద దరిద్ర దేవత తాండవం చేస్తుంది కాబోలు..అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఒక రేంజ్ ఓపెనింగ్స్ పెట్టె మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఆయన రేంజ్ ఓపెనింగ్ దక్కకపోవడం నిజంగా షాక్ కి గురి చేసిన విషయం..కనీసం ఓపెనింగ్స్ ని కూడా దక్కించుకోలేకపోయిన ఈ సినిమా ఫుల్ రన్ లో మరింత దారుణమైన వసూళ్లను రాబట్టి చ్లొసింగ్ కలెక్షన్స్ 48 కోట్ల రూపాయిల వద్ద ఆగిపోయింది.
దీనితో కొరటాల వద్ద కోట్ల రూపాయిలు కుమ్మరించి హక్కులను సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 80 కోట్ల రూపాయిల భారీ నష్టాన్ని మిగిలించింది..డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కొరటాల శివ వద్దకి వచ్చి కనీసం 45 కోట్ల రూపాయిలు వెనక్కి తిరిగి ఇవ్వలసిందే అని పట్టుబట్టారు..డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే భవిష్యత్తులో మీతో బిజినెస్ చేసే సమస్యే లేదని..మీరు దర్శకత్వం వహించే సినిమాలను కూడా ఇక కొనబోమని కొరటాల శివ పీక మీద కత్తి పెట్టేంత పని చేసారు..దీనితో కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్స్ అడిగిన మొత్తాన్ని ఇస్తాను అని ముందుకొచ్చాడు..ఇచ్చిన మాట ప్రకారమే అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చిన పాతిక కోట్ల రూపాయిలను డిస్ట్రిబ్యూటర్స్ కి పంచేసాడు..ఇక మిగిలిన 20 కోట్ల రూపాయిలు కోసం తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి అప్పులు తీర్చబోతున్నాడు..తన ఆస్తులను తాకట్టు పెట్టిన కూడా ఇంకా 5 కోట్ల రూపాయిల బాలన్స్ ఉందట..ఈ డబ్బులను చిరంజీవి ని అడుగుదాం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
వాస్తవానికి ఈ సినిమా కోసం అటు రామ్ చరణ్ కానీ..ఇటు చిరంజీవి కానీ ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు..సినిమా విడుదలై వచ్చిన లాభాల్లో వాటాలు పంచుకుందామనే ఆలోచనలో ఉన్నారు..అందుకే కొణిదెల ప్రొడక్షన్స్ అని పేరు కూడా వేసుకున్నారు..కానీ లాభాలు రాకపోగా రివర్స్ లో నష్టాలు వాటిల్లాయి..దీనితో చిరంజీవి – రామ్ చరణ్ ఉచితంగానే ఈ సినిమా చేసినట్టు అయ్యింది..ఈ సినిమా కోసం చిరంజీవి రెండేళ్లు కాల్ షీట్స్ కేటాయించాడు..పాపం రామ్ చరణ్ అయితే #RRR మూవీ షూటింగ్ జరుగుతున్నా సమయం లో రాజమౌళి తో ప్రత్యేకమైన అనుమతిని రప్పించుకొని డేట్స్ కేటాయించాడు..ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తే చివరికి ఇలాంటి నీచమైన ఔట్పుట్ ఇచ్చినందుకు గాను కొరటాల శివ పై మెగా అభిమానులు తీవ్రమైన కోపం తో ఉన్నారు..చిరంజీవి 150 సినిమాలు తీస్తే, ఏ సినిమా కూడా ఆచార్య వంటి వరస్ట్ రేంజ్ లో ఏ సినిమా కూడా లేదని మెగా అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..కొరటాల శివ డిస్ట్రిబ్యూషన్ చేసి డబ్బులు పోగు చేసుకునే దాని మీద పెట్టిన శ్రద్ధతో సగం ఆచార్య మీద పెట్టి ఉంటె ఈరోజు ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఉండేదని..మెగా అభిమానులు కొరటాల పై విరుచుకుపడుతున్నారు.