
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలింది..స్టోరీ ని కాకుండా కేవలం హీరోల స్టార్ ధం మీద మాత్రమే ఆధారపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆచార్య చిత్రం..మెగాస్టార్ సినిమాకి మొన్నటి వరుకు టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేవి..ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా చిరంజీవి సినిమాకి వారం రోజుల పాతూరి థియేటర్స్ బయట హౌస్ ఫుల్ బోర్డులు కనిపించేవి..కానీ ఆచార్య సినిమాకి మొదటి రోజు నుండే కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ బోర్డులు పడలేదు అంటే ఈ చిత్రానికి ఏ స్థాయి డిజాస్టర్ టాక్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను అభిమానులు ఒక్క రేంజ్ లో ఊహించుకుంటే, కొరటాల శివ చాలా సప్పగా సన్నివేశాలు రాసుకొని అభిమానులకు సైతం చిరాకు రప్పించేలా చేసాడు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల అయ్యి నేటికీ వారం రోజులు కావొస్తుంది..వారం రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం ఆ ఆర్టికల్ లో చూడబోతున్నాం.
డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కి దాదాపుగా 37 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఇది మంచి వసూళ్లే అయ్యినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి..ఎందుకంటే మెగాస్టార్ గత చిత్రం సైరా నరసింహ రెడ్డి చిత్రానికి దాదాపుగా మొదటి రోజు 38 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఇది అప్పట్లో ఆల్ టైం నాన్ బాహుబలి 2 రికార్డు..మొదటి రోజు 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా,రెండవ రోజు కేవలం 6 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసి బయ్యర్స్ కి కోలుకోలేని షాక్ ని ఇచ్చింది..ఆలా రెండు రోజులకు కలిపి 44 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి కేవలం 47 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసింది..ఇది మెగాస్టార్ రేంజ్ కి చాలా అవమానకరమైన వసూళ్లు అనే చెప్పాలి.
ఇక సోమవారం నుండి ఈ సినిమా పై టాక్ ప్రభావం మాములు రేంజ్ లో పడలేదు..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కేవలం కోటి రూపాయిలు కూడా వసూలు చెయ్యలేకపోయింది..గడిచిన పదేళ్ల నుండి ఒక్క స్టార్ హీరో డిజాస్టర్ ఫ్లాప్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు ఎప్పుడు రాలేదు అనే చెప్పాలి..నాల్గవ రోజు కేవలం 50 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం 5 రోజు నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాలలో క్లోసింగ్ టబుకి వచ్చేసింది..రంజాన్ దినం అయినా ఈ సినిమాకి కలిసి వస్తుంది అనుకుంటే..రంజాన్ మాసం లో నెల రోజుల క్రితం విడుదల అయినా #RRR కి , 20 రోజుల క్రితం విడుదల అయినా KGF చాప్టర్ 2 సినిమాకి హౌస్ ఫుల్స్ పడ్డాయి కానీ..ఆచార్య సినిమాకి మాత్రం హౌస్ ఫుల్స్ పడకపోవడం గమనార్హం..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి తోలి వారం 49 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిలు వసూలు చేస్తుంది అని అంచనా..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 137 కోట్ల రూపాయలకు జరగగా..డిస్ట్రిబ్యూటర్స్ కి 87 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది అని ట్రేడ్ వర్గాల అంచనా.